Share News

ఆర్టీజీఎస్‌తో 2,259 అంబులెన్సులు అనుసంధానం

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:06 AM

తుఫాను ప్రభావం కారణంగా అవసరమైన వారికి వెంటనే వైద్య సేవలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశామని, బాధితుల సహాయార్థం 2,259 అంబులెన్సులను ఆర్టీజీఎస్తో అనుసంధానం చేశామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు.

ఆర్టీజీఎస్‌తో 2,259 అంబులెన్సులు అనుసంధానం

  • తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశాఖ ముందస్తు ఏర్పాట్లు

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాను ప్రభావం కారణంగా అవసరమైన వారికి వెంటనే వైద్య సేవలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశామని, బాధితుల సహాయార్థం 2,259 అంబులెన్సులను ఆర్టీజీఎస్తో అనుసంధానం చేశామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ వెల్లడించారు. తుఫాను సన్నద్ధతపై మంగళవారం ఉన్నతాధికారులతో ఆయన వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. తుఫాన్‌ నేపథ్యంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు తెలిపారు.

అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు మొత్తం 8,441 అత్యవసర పడకలను అందుబాటులో ఉంచామని, 1,050 వైద్య బృందాలను సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో 108, 104(సంచార వైద్యశాలలు), 102(తల్లీబిడ్డ) వాహనాలు మొత్తం 1,892 అంబులెన్సులను ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. బుధవారం వర్షాలు, గాలుల తీవ్రతపై వచ్చిన హెచ్చరికలతో 20 జిల్లాలోని 255 మండలాల్లో ఆస్పత్రుల వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 06:06 AM