పద్మ అవార్డ్స్ 2026.. అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్
ABN , Publish Date - Jan 25 , 2026 | 09:31 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పద్మ అవార్డులపై స్పందించారు. ఈమేరకు తమ ఎక్స్ ఖాతాలలో పోస్టులు పెట్టారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు.
అమరావతి, జనవరి 25: కేంద్ర ప్రభుత్వం ఈరోజు (ఆదివారం) పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పద్మ అవార్డులపై స్పందించారు. ఈమేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు. ఆ పోస్టులో.. ‘పద్మ అవార్డు గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంకితభావం, నైపుణ్యం ద్వారా వారు తమ రంగాలలో దేశానికి సేవ చేశారు. దేశ పురోగతికి అద్భుతమైన కృషి చేశారు. వారి ప్రయాణాలు దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి’ అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ గర్వపడుతోంది: నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పద్మశ్రీ అవార్డులపై స్పందించారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన మురళీ మోహన్, వెంపటి కుటుంబ శాస్త్రికి అభినందనలు తెలియజేశారు. ఆ పోస్టులో.. ‘పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మాగంటి మురళీ మోహన్, వెంపటి కుటుంబ శాస్త్రి గారికి హృదయపూర్వక అభినందనలు. భారతీయ సినిమా, ప్రజా జీవితానికి మురళీ మోహన్ దశాబ్దాలుగా చేసిన కృషి అసాధారణమైనది. కూచిపూడిలో కుటుంబ శాస్త్రి అసమానమైన పాండిత్యం మన శాస్త్రీయ కళలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఈరోజు వారికి గుర్తింపు దక్కినందుకు ఆంధ్రప్రదేశ్ గర్వపడుతోంది’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు
మీ బ్రెయిన్ రేంజ్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 21 సెకెన్లలో కనిపెట్టండి