Share News

ఆన్‌లైన్‌ నామినేషన్ల పిల్‌పై కౌంటర్‌ వేయండి

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:44 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసేందుకు వీలు కల్పించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

ఆన్‌లైన్‌ నామినేషన్ల పిల్‌పై కౌంటర్‌ వేయండి

  • పూర్తి వివరాలివ్వాలంటూ ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసేందుకు వీలు కల్పించేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యం పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారం పై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.

కాకినాడకు చెందిన హెల్ప్‌ ది పీపుల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌/మేనేజింగ్‌ ట్రస్టీ కీతినీడి అఖిల్‌ శ్రీ గురుతేజ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ మంగళవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది తాండవ యోగేష్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిధులతో క్యాండిడేట్స్‌ పోర్టల్‌ అభివృద్ధి చేశారన్నారు. సంబంధిత పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్ల స్వీకరణకు వెసులుబాటు ఉందన్నారు. పట్టణ స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసే సౌకర్యం కల్పించలేదన్నారు. దీంతో నామినేషన్లు చించివేయడం, లాక్కోవడం వంటి 55 సంఘటనలు జరిగాయన్నారు.

పంచాయితీ ఎన్నికల్లోనైనా ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ వేసేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రజాహిత వ్యాజ్యంలో పిటిషనర్‌ అభ్యర్ధనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో నామినేషన్ల స్వీకరణ విషయంలో సంబంధింత నిబంధనలు సవరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ కోరలేరన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 06:44 AM