Share News

స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిపేయండి

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:13 AM

రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్‌ కల్పన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నందున స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిపేయండి

  • హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్‌ కల్పన సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నందున స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. గుంటూరు జిల్లా చుండూరు మండలానికి చెందిన డాక్టర్‌ చేబ్రోలు రవికుమార్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేయగా.. అది గురువారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వివేకానంద విరూపాక్ష, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 06:00 AM