అవరోధాలు ఎదురైతే ఎన్నికల అధికారికి చెప్పండి
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:16 AM
మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు అవరోధాలు ఎదురైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల అధికారిని కలిసి వినతి సమర్పించాలని హైకోర్టు సూచించింది.
నామినేషన్ల దాఖలుపై అభ్యర్థులకు హైకోర్టు సూచన
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు అవరోధాలు ఎదురైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల అధికారిని కలిసి వినతి సమర్పించాలని హైకోర్టు సూచించింది. ఎన్నికల నిబంధనలను అనుసరించి సదరు వినతి పై నామినేషన్ గడువులోగా తగిన నిర్ణయం వెల్లడించాలని ఎన్నికల అధికారిని ఆదేశించింది. వ్యాజ్యాన్ని పరిష్కరించింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికల సందర్భంగా నామినేషన్ ప్రక్రియ స్వేచ్ఛగా జరిగేందుకు వీలుగా సాధారణంగా ఏర్పాటు చేసే నామినేషన్ కేంద్రాలకు అదనంగా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రతీ జిల్లా కేంద్రంలో ప్రత్యేక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై బుధవారం వాదనలు ముగిశాయి. గురువారం న్యాయమూర్తి నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు