Share News

ధరణి బ్రాండ్‌తో నాణ్యమైన సన్నబియ్యం

ABN , Publish Date - Oct 14 , 2026 | 05:23 AM

బియ్యం ధరలు పెరిగినపోయిన నేపథ్యంలో ‘ధరణి’ బ్రాండ్‌తో ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యంను రాష్ట్ర ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా అందజేస్తోంది. కర్నూలు సోన బియ్యం కిలో రూ.50, బీపీటీ బియ్యం కిలో రూ.49 చొప్పున విక్రయిస్తున్నారు. తొలుత ఒక్కో వినియోగదారుడికి 10 కిలోల చొప్పున విక్రయించగా.. సోమవారం నుంచి 26 కిలోల బస్తాలను ఒక్క వినియోగదారుడికి విక్రయిస్తున్నారు. రైతుబజార్లకు సన్నబియ్యం సరఫరా బాధ్యతను ప్రభుత్వం జిల్లాల్లోని రైస్‌ మిల్లర్ల అసోసియేషన్లకు అప్పగించింది. గతవారం బియ్యం నిల్వల్లో కొరత నెలకొనడంతో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ సోమవారం రంగంలోకి దిగి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. 26 కిలోల బస్తాల విక్రయాలను ప్రారంభించారు.

 ధరణి బ్రాండ్‌తో నాణ్యమైన సన్నబియ్యం

బియ్యం ధరలు పెరిగినపోయిన నేపథ్యంలో ‘ధరణి’ బ్రాండ్‌తో ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యంను రాష్ట్ర ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా అందజేస్తోంది. కర్నూలు సోన బియ్యం కిలో రూ.50, బీపీటీ బియ్యం కిలో రూ.49 చొప్పున విక్రయిస్తున్నారు. తొలుత ఒక్కో వినియోగదారుడికి 10 కిలోల చొప్పున విక్రయించగా.. సోమవారం నుంచి 26 కిలోల బస్తాలను ఒక్క వినియోగదారుడికి విక్రయిస్తున్నారు.

రైతుబజార్లకు సన్నబియ్యం సరఫరా బాధ్యతను ప్రభుత్వం జిల్లాల్లోని రైస్‌ మిల్లర్ల అసోసియేషన్లకు అప్పగించింది. గతవారం బియ్యం నిల్వల్లో కొరత నెలకొనడంతో పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ సోమవారం రంగంలోకి దిగి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. 26 కిలోల బస్తాల విక్రయాలను ప్రారంభించారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 05:23 AM