ఏపీ భవన్ ఓఎస్‌డీగా సౌరభ్ గౌర్
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:02 AM
పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పలువురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్స్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సివిల్ సప్లయిస్ ఎండీగా వరప్రసాద్
అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పలువురు ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్స్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సౌరభ్ గౌర్‌ను ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌కు ఓఎస్‌డీగా నియమించింది. గత ప్రభుత్వంలో సెర్ఫ్ సీఈవోగా విధులు నిర్వహించిన డి.మురళీధర్‌రెడ్డిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కన పెట్టింది. ఎట్టకేలకు ఆయన్ను గిరిజన సంక్షేమ కార్యదర్శిగా నియమించింది. మంజులే బాలాజీ దిగంబరను ఈడబ్యూఎస్ అదనపు కార్యదర్శిగా, పర్యాటక శాఖ కార్యదర్శిగా అమ్రపాలి, యువజన సర్వీసుల డైరెక్టర్‌గా నీలకంఠారెడ్డి, పరిశ్రమల శాఖ జాయింట్ సెక్రటరీగా బి.అనిల్‌కుమార్ రెడ్డిని నియమించింది.
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సోసైటీ సెక్రటరీగా ఎన్.తేజ్‌భరత్, గ్రామ, వార్డు సచివాలయాల సెక్రటరీగా జి.శ్రీనుకుమార్‌ను నియమించింది. నాన్ ఎస్‌సీఎస్ కేటగిరిలో ఐఏఎస్ హోదా పొందిన ఎం.వరప్రసాద్‌ను సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ ఎండీగా నియమించింది. అలాగే హార్టికల్చర్ డైరెక్టర్ కె.శ్రీనివాసులుకు అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న శుభమ్ బన్సల్‌కు ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ వార్తలనూ చదవండి: