కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ సత్తా
ABN , Publish Date - Oct 01 , 2026 | 06:02 AM
కెనడాలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సీర చంద్రకళ సత్తా చాటింది. విజయవాడ ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖలో ఆమె కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈమె 76 కిలోల సీనియర్ మహిళల విభాగంలో..
రజతంతో కెనడా నుంచి వచ్చిన చంద్రకళకు మంత్రి కొల్లు ఘనస్వాగతం
విజయవాడ, సెప్టెంబరు30 (ఆంధ్రజ్యోతి): కెనడాలో ఇటీవల జరిగిన కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సీర చంద్రకళ సత్తా చాటింది. విజయవాడ ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖలో ఆమె కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈమె 76 కిలోల సీనియర్ మహిళల విభాగంలో.. భారత్ తరఫున బరిలోకి దిగి.. మొత్తం 470 కిలోలు లిఫ్ట్ చేసి రజత పతకం సాధించింది. ఆమె కెనడా నుంచి బుధవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. మంత్రి కొల్లు రవీంద్ర ఆమెకు ఘనస్వాగతం పలికి అభినందనలు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’