విద్యుత్ సిబ్బంది అప్రమత్తం.. విధుల్లో వేల మంది
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:02 AM
తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
30 వేల కాల్స్ ఒకేసారి స్వీకరించేలా కాల్‌సెంటర్ బలోపేతం
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సుమారు 6 వేల మంది అనుభవజ్ఞులైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. తుఫాన్ ప్రభావం లేని ప్రాంతాల్లోని సిబ్బంది సెలవులను రద్దు చేసి, అవసరమైన వారిని ప్రభావిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి చెప్పారు.
తెగిన విద్యుత్ తీగలు, కూలిన స్తంభాలు, దెబ్బతిన్న కండక్టర్ల మరమ్మతులతో పాటు సమస్యలు తలెత్తిన 132 కేవీ సబ్ స్టేషన్ల వద్ద త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టేలా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. సమస్యలు ఎదురైతే 1912కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ఒకేసారి 30 వేల కాల్స్ స్వీకరించేలా ఆ కాల్ సెంటర్‌ను బలోపేతం చేశామని చెప్పారు. తెగిపడిన విద్యుత్ తీగ లు, కండక్టర్లను చేతితో తాకవద్దని హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు