గ్రూప్-1లోకి డీఈవో పోస్టులు.. నేరుగా భర్తీగ్రూప్-1లోకి డీఈవో పోస్టులు.. నేరుగా భర్తీ
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:03 AM
గ్రూప్-1 పరిధిలోకి తీసుకొచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టుల నియామకం మల్టీ జోన్‌లో చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2 పరిధిలో నియామకాలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఉప విద్యాశాఖ అధికారి పోస్టులు మాత్రమే నేరుగా భర్తీ చేస్తున్నారు.
విద్యా శాఖ సర్వీస్ రూల్స్‌కు సవరణ
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పరిధిలోకి తీసుకొచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి పోస్టుల నియామకం మల్టీ జోన్‌లో చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2 పరిధిలో నియామకాలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటివరకూ ఉప విద్యాశాఖ అధికారి పోస్టులు మాత్రమే నేరుగా భర్తీ చేస్తున్నారు. తొలిసారి డీఈవో పోస్టులను గ్రూప్-1 పరిధిలోకి తీసుకొచ్చి నేరుగా భర్తీ చేయబోతున్నారు. ఈ క్రమంలో పలు పోస్టులకు సంబంధించి ఏపీ విద్యాశాఖ సర్వీస్ రూల్స్ సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఈవో పోస్టులకు ప్రభుత్వం అపాయింటింగ్ అథారిటీ అని పేర్కొంది.
కొత్తగా కోఆర్డినేటర్(పీఈఎస్‌సీ), జిల్లా కోఆర్డినేటర్(ఓపెన్ స్కూల్స్), ఎంఈవో-2 పోస్టులను చేర్చింది. ఉప విద్యాశాఖ అధికారి, డైట్ సీనియర్ లెక్చరర్, కోఆర్డినేటర్(పీఈఎ్‌ససీ), జిల్లా కోఆర్డినేటర్(ఓపెన్ స్కూల్స్) పోస్టులు కూడా మల్టీ జోన్ పరిధిలోనే ఉన్నాయి. ఈ పోస్టులకు పాఠశాల విద్య డైరెక్టర్ అపాయింటింగ్ అథారిటీగా ఉంటారు. ఎంఈవో, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, డైట్ లెక్చరర్, డైట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, రీజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డైట్ ఆర్ట్ లెక్చరర్, ఎంఈవో-2 పోస్టులను జోన్ పోస్టులుగా నిర్ణయించింది.
ఈ వార్తలనూ చదవండి:
తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!
ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు