Share News

వెబ్ ల్యాండ్ ఫోర్జరీ ముఠా గుట్టు రట్టు చేసిన ఏపీ సీఐడీ

ABN , Publish Date - Nov 10 , 2026 | 07:53 PM

ఏపీ సీఐడీ పోలీసులు వెబ్ ల్యాండ్ ఫోర్జరీ ముఠా గుట్టు రట్టు చేశారు.

వెబ్ ల్యాండ్ ఫోర్జరీ ముఠా గుట్టు రట్టు చేసిన ఏపీ సీఐడీ
Andhra Pradesh CID

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ సీఐడీ పోలీసులు వెబ్ ల్యాండ్ ఫోర్జరీ ముఠా గుట్టు రట్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. సీనియర్ ఎన్‌ఐసీ అధికారి యూజర్ ఐడీని ఈ ముఠా దుర్వినియోగం చేసినట్టు గుర్తించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు, పడమర లక్ష్మీపురం గ్రామాల్లో 6.55 ఎకరాల విస్తీర్ణంలో జరిగిన వెబ్ ల్యాండ్ రికార్డుల్లో అనుమానస్పద అనాధికార మార్పులపై కేసు నమోదైంది. కంప్యూటర్‌ను హ్యాక్ చేసి అనుమతి లేకుండా డేటా డౌన్‌లోడ్ చేయడం, కంప్యూటర్‌లో వైరస్‌లు, మాల్‌వేర్‌లను జొప్పించడం, నెట్ వర్క్‌కు అంతరాయం కలిగించడం వంటి నేరాలపై కేసు నమోదు చేశారు.


తాహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ లేకుండా ఆన్‌లైన్ రికార్డుల్లో కొత్త పట్టాదారుల పేర్లు ప్రత్యక్షం అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో వడ్లమూడి ఏడుకొండలు, సాయికుమార్, వేముల వెంకట్రావు, షేక్ భాషాలను సీఐడీ అరెస్టు చేసింది. మొబైల్ ఫోన్లు, డిజిటల్ చెల్లింపు వివరాలు, అడంగల్ వివరాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఫోర్జరీ, చీటింగ్ అభియోగాలతో కూడా కేసు నమోదు చేశారు. ఈ అక్రమాల్లో మరికొంతమందికి ప్రమేయం ఉందని సిఐడి అధికారులు భావిస్తున్నారు. ఫోర్జరీ కోసం పలువురి నుంచి నిందితులు డబ్బులు వసూలు చేసిన గుర్తించారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.


ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

Updated Date - Nov 10 , 2026 | 07:56 PM