-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh Budget 2026-27 Live Updates: Latest Figures, Scheme Updates and Highlights Siva
-
Andhra Pradesh Budget 2026-27: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27..
ABN , First Publish Date - Feb 14 , 2026 | 09:52 AM
Andhra Pradesh Budget 2026-27: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27 వివరాలు ఇక్కడ చూసేయండి..
Live News & Updates
-
Feb 14, 2026 13:45 IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారానికి వాయిదా
-
Feb 14, 2026 13:30 IST
ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ.53,752 కోట్లు
-
Feb 14, 2026 13:08 IST
మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం..
ధాన్యం సేకరణకు సంబంధించి రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లింపు.
భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాల అందజేత.
'పొలం పిలుస్తోంది' కార్యక్రమంతో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు.
పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు కేటాయింపు.
వ్యవసాయ యాంత్రీకరణలో 50 శాతం రాయితీతో రూ.136 కోట్లు.
80 శాతం రాయితీ కింద రూ.90.4 కోట్లతో 1,130 డ్రోన్ కేంద్రాలు.
గతేడాది రూ.182 కోట్ల రాయితీతో విత్తనాల సరఫరా.
-
Feb 14, 2026 13:07 IST
మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం..
పంటలను కాపాడేందుకు రైతులకు అన్నివిధాలుగా సాయం.
సాగునీటి సౌకర్యాల కల్పనకు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి.
వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం.
PM కిసాన్ పథకం కింద రూ.6,309 కోట్లు చెల్లింపు.
2026-27లో రూ.6,600 కోట్లు PM కిసాన్ కోసం కేటాయింపు.
-
Feb 14, 2026 13:06 IST
మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం..
రాష్ట్ర ఆర్థిక రంగానికి మూలస్తంభంగా వ్యవసాయం.
యువత వ్యవసాయం వైపు మళ్లాలంటే వ్యవసాయం లాభసాటి కావాలి.
అధిక పోషక విలువలు ఉండే పంటల సాగుతో రైతులకు లాభం.
దేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతం.
11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించాం.
24 గంటల్లో 9వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ.
-
Feb 14, 2026 13:05 IST
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: అచ్చెన్న
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షం: అచ్చెన్న
రైతును రాజుగా చేయడానికి రైతన్న మీ కోసం కార్యక్రమం: అచ్చెన్న
నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రి టెక్, ఫుడ్ ప్రాసెసింగ్‌కు అధిక ప్రాధాన్యత: అచ్చెన్న
-
Feb 14, 2026 12:56 IST
మంత్రి పయ్యావుల ప్రసంగం..
కూటమి ప్రభుత్వం ధరల స్థితీకరణ నిధికి ఒక్క ఏడాదికే రూ.1,200 కోట్లు వ్యయం.
పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణకు ప్రాధాన్యం.
ఉద్యోగులకు రూ.1,100 కోట్ల బకాయిల విడుదల.
30,607 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.
గత ప్రభుత్వం వైద్య శాఖకు రూ.6,487 కోట్ల బకాయిలు చెల్లించలేదు.
ప్రజల ఆరోగ్య రక్షణ కోసం సంజీవని ప్రాజెక్టు.
-
Feb 14, 2026 12:46 IST
మంత్రి పయ్యావుల ప్రసంగం..
పశు బీమా పథకం అమలుకు నిరంతర ప్రాధాన్యత.
పశు సేవల బలోపేతానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణాలు.
మత్య్సకార సేవల పథకం అమలుతో ఆర్థిక సాయం రూ.20 వేలకు పెంపు.
గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని సమర్థవంతంగా వినియోగించుకోలేదు.
రూ.7,500 కోట్లను కేటాయించి కేవలం.. రూ.880 కోట్లనే గత ప్రభుత్వం ఖర్చు చేసింది.
-
Feb 14, 2026 12:44 IST
మంత్రి పయ్యావుల ప్రసంగం..
పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాం.
డయాఫ్రం వాల్ నిర్మాణం ఇప్పటికే 91 శాతం పూర్తి.
60 శాతం పూర్తైన పోలవరం ప్రాజెక్టు.
వంశధార-2, హంద్రీనీవా, పూలసుబ్బయ్య వెలిగొండ, పోలవరం పూర్తికి కృషి.
గ్లోబల్ సమ్మిట్‌లో రూ.13.25 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు 97 శాతం పూర్తి.
ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్.
ఉచిత విద్యుత్‌తో లక్షకు పైగా కుటుంబాలకు లబ్ధి.
-
Feb 14, 2026 12:43 IST
మంత్రి పయ్యావుల ప్రసంగం..
గత ప్రభుత్వం మాకు రూ.9.74 లక్షల కోట్లు అప్పుగా మిగిల్చింది.
గత ప్రభుత్వం నిర్వాకంతో సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి.
భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేలా విధానాల రూపకల్పన.
పట్టిసీమ వంటి పథకాలను అమలుచేయడం వల్ల పలు ప్రాంతాలకు జల భద్రత.
-
Feb 14, 2026 12:42 IST
మంత్రి పయ్యావుల ప్రసంగం..
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమ.
రాయలసీమ కోసం ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ప్లాన్.
2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణం 14.41 లక్షల హెక్టార్లకు విస్తరణ.
ప్రపంచ మార్కెట్లతో అనుసంధానికి రోడ్ల కనెక్టివిటీ.
అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హార్టికల్చర్ క్లస్టర్లు.
వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ప్రత్యక్షంగా 9 లక్షల ఉద్యోగాలు.
-
Feb 14, 2026 12:41 IST
పయ్యావుల ప్రసంగం..
కేంద్ర బడ్జెట్.. ఏపీకి ఆశాకిరణంగా మారింది.
తూర్పు కోస్తా పారిశ్రామిక కారిడార్.. పర్యాటక కేంద్రాల అభివృద్ధికి దోహదం.
పూర్వోదయ పథకంతో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు.
ఇతర రాష్ట్రాలతో పోటీపడి కెమికల్ పార్క్.
మెగా టెక్స్‌టైల్ పార్క్ లాంటి ప్రాజెక్టులు సాధిస్తాం.
విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధం.
విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లు రాష్ట్రానికి కీలక గ్రోత్ ఇంజిన్లు.
నీతి ఆయోగ్‌తో కలిసి విశాఖ ఎకనామిక్ రీజియన్ మాస్టర్ ప్లాన్.
-
Feb 14, 2026 12:26 IST
అమరావతి: గణనీయంగా తగ్గిన రెవెన్యూ లోటు..
2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ.41,118.36 కోట్లు
2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు రూ.22, 002.50 కోట్లు
2025-26 రివైజ్డ్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ.80,567.47 కోట్లు
2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ద్రవ్య లోటు రూ.75,868.09 కోట్లు
-
Feb 14, 2026 12:25 IST
రూపాయి పోక
సంక్షేమం – 17 శాతం
విద్య – 11 శాతం
ఆర్ధికం – 8 శాతం
పంచయతీరాజ్, గ్రామీణాభివృద్ధి – 7 శాతం
వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం – 6 శాతం
జలవనరులు – 6 శాతం
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ – 4 శాతం
విద్యుత్ రంగం – 4 శాతం
వ్యవసాయం, అనుబంధ రంగాలు – 4 శాతం
ఇతరాలు (హోం, ఆర్ అండ్ బీ, పరిశ్రమలు) – 15 శాతం
వడ్డీలు, రుణాల చెల్లింపులు – 18 శాతం
-
Feb 14, 2026 12:25 IST
2026-27 రాష్ట్ర బడ్జెట్..
రూపాయి రాక
పన్నుల ద్వారా ఆదాయం – 38 శాతం
పన్నేతర ఆదాయం – 3 శాతం
బహిరంగ మార్కెట్ రుణాలు – 30 శాతం
కేంద్ర పన్నుల్లో వాటా – 19 శాతం
గ్రాంట్ ఇన్ ఎయిడ్ – 10 శాతం
-
Feb 14, 2026 12:14 IST
ఏపీ బడ్జెట్‌లో కేటాయింపులు..
మున్సిపల్ శాఖ-రూ.14,538.68కోట్లు.
EWS వెల్ఫేర్-రూ.10,699.33కోట్లు.
అమరావతికి -రూ.6వేల కోట్లు.
రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులు-రూ.13,546కోట్లు.
-
Feb 14, 2026 12:04 IST
ఏపీ బడ్జెట్‌లో వ్యవసాయం-నీటి భద్రత కేటాయింపులు
మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు-రూ.9,906 కోట్లు
అన్నదాత సుఖీభవ-రూ.6,600 కోట్లు
పోలవరం-రూ.6,105కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన-రూ.1,927 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి-రూ.500 కోట్లు
మత్స్యకార సేవలో-రూ.260కోట్లు
పంటల బీమా-రూ.250 కోట్లు
పీఎం కృషి సించాయి యోజన-రూ.190 కోట్లు
-
Feb 14, 2026 12:04 IST
ఏయే పథకానికి ఎంత కేటాయించారంటే..
స్త్రీ, శిశు సంక్షేమం-రూ.4,581 కోట్లు
ఉపకారవేతనాలు-రూ.3,836 కోట్లు
సమగ్ర శిక్షణ-రూ.2,946 కోట్లు
ఉన్నత విద్య-రూ.2,566 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం-రూ.2,161 కోట్లు
మన బడి, మన భవిష్యత్-రూ.1,500 కోట్లు
నైపుణ్యాభివృద్ధి-రూ.1,232 కోట్లు
పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా-రూ.707 కోట్లు
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర-రూ.654 కోట్లు
యువత, క్రీడలు-రూ.438 కోట్లు
-
Feb 14, 2026 12:03 IST
ఏపీ వార్షిక బడ్జెట్‌లో ఏ పథకానికి ఎంత కేటాయించారంటే..
ఏపీ బడ్జెట్‌లో వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపులు.
ఎన్టీఆర్ భరోసా-రూ.27,719 కోట్లు
దీపం 2.0 - రూ.2,601 కోట్లు
వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు-రూ.2,320 కోట్లు
స్త్రీశక్తి-రూ.1,420 కోట్లు
వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్-రూ.600 కోట్లు
ఆటో డ్రైవర్ల సేవలో-రూ.450 కోట్లు
తల్లికి వందనం-రూ.9,668 కోట్లు
-
Feb 14, 2026 12:02 IST
ఏపీ వార్షిక బడ్జెట్ కేటాయింపులు ఇవే..
ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.
పాఠశాల విద్య రూ.32,308 కోట్లు.
వైద్య శాఖ రూ.19,306 కోట్లు.
వ్యవసాయ శాఖ రూ.11,745 కోట్లు.
సాంఘిక సంక్షేమం రూ.11,118 కోట్లు.
బీసీ సంక్షేమం రూ.23,650 కోట్లు.
ఇంధన శాఖ రూ.13,934 కోట్లు.
పంచాయతీరాజ్ శాఖ రూ.22,941 కోట్లు.
జలవనరులు రూ.18,223 కోట్లు.
-
Feb 14, 2026 11:56 IST
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగం పాయింట్స్..
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాం.
11.75 శాతం వృద్ధి రేటు నమోదైంది.
ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రెండంకెల వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నాం.
-
Feb 14, 2026 11:53 IST
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగం పాయింట్స్..
ఇప్పటి వరకు ఏం సాధించాం.. ఇంకా ఏం సాధించాలనే అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించాం.
ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దాం.
కాగితాలకే పరిమితం కాకుండా.. క్షేత్ర స్థాయిలో సంక్షేమాన్ని అమలు చేయడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించాం.
2014-19 మధ్య కాలంలో వృద్ధి రేటు 13.5 శాతం.
2019-24 మధ్య కాలంలో వృద్ధి రేటు 10.3 శాతానికి పడిపోయింది.
-
Feb 14, 2026 11:51 IST
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగం పాయింట్స్..
ఆర్థిక విధ్వంసం ఎదుర్కొన్న రాష్ట్రాన్ని సరిదిద్దడానికి రెండేళ్ల సమయం ఎంత మాత్రమూ సరిపోదు.
రాష్ట్రానికి విభజనతో జరిగిన నష్టంతో పాటు గత ప్రభుత్వ పాలన కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
చాలా సవాళ్లు ఉన్నా రాష్ట్రం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను.
-
Feb 14, 2026 11:50 IST
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగం పాయింట్స్..
బడ్జెట్ ప్రవేశపెట్టడమంటే కేవలం ఆదాయ వ్యయాలను వివరించడం కాదు.
రాష్ట్ర ప్రజల ఆశలను నెరవేర్చేందుకు బడ్జెట్ అనేది రోడ్ మ్యాప్ వంటింది.
మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కలగడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసేలా బడ్జెట్ ఉంది.
పాలన ఎలా చేయకూడదోననేది గత ప్రభుత్వాన్ని చూస్తే అర్థమవుతుంది.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దేలా 2024లో బడ్జెట్ ప్రవేశపెట్టాం.
స్వర్ణాంధ్ర విజన్-2047కు బాటలు వేస్తూ 2025 బడ్జెట్ ప్రవేశపెట్టాం.
-
Feb 14, 2026 11:42 IST
ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..
పాఠశాల విద్య రూ.32,308 కోట్లు
వైద్య శాఖ రూ.19,306 కోట్లు
వ్యవసాయ శాఖ రూ.11,745 కోట్లు
సాంఘిక సంక్షేమం రూ.11,118 కోట్లు
-
Feb 14, 2026 11:41 IST
ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు.
మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా.
రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు.
ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు.
-
Feb 14, 2026 11:41 IST
వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం నా అదృష్టం: పయ్యావుల
విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నాం.
అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలనేదే మా ఆకాంక్ష.
గూగుల్ AI సెంటర్‌తో ప్రపంచమంతా ఏపీ వైపు చూసింది.
గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం చేసుకుంది బాహుబలి ఒప్పందం.
-
Feb 14, 2026 11:41 IST
2026-27 ఆర్థిక సంవత్సరానికి ఏపీ బడ్జెట్ రూ.3,32,205 కోట్లు.
రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు
మూలధన వ్యయం రూ.53,915 కోట్లగా అంచనా
రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు
ద్రవ్య లోటు రూ.75,868 కోట్లగా అంచనా
-
Feb 14, 2026 11:40 IST
స్వర్ణాంధ్ర లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్: మంత్రి పయ్యావుల
మా దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదు: పయ్యావుల
రాయలసీమ రైతుల కలలను సాకారం చేసేది బడ్జెట్: పయ్యావుల
కుటుంబాన్ని నడిపిస్తున్న గృహిణికి భరోసా ఇచ్చేది బడ్జెట్: పయ్యావుల
-
Feb 14, 2026 11:40 IST
అమరావతి: మూడో రోజు ప్రారంభమైన ఏపీ శాసన మండలి సమావేశాలు
మండలిలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న హోం మంత్రి అనిత.
మండలిలో వ్యవసాయ బడ్జెట్‌లో ప్రవేశ పెట్టనున్న రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్.
-
Feb 14, 2026 11:40 IST
అమరావతి: అసెంబ్లీలో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
-
Feb 14, 2026 11:40 IST
అమరావతి: 2026-27 బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్.
రూ.3.45 లక్షల కోట్ల అంచనాతో ఏపీ బడ్జెట్.

-
Feb 14, 2026 10:52 IST
అమరావతి: ఏపీ అసెంబ్లీ సీఎం పేషీలో ప్రారంభమైన కేబినెట్ భేటీ
-
Feb 14, 2026 10:47 IST
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం
2026-27 బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్న కేబినెట్
కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల
రూ.3.45 లక్షల కోట్ల అంచనాతో ఏపీ బడ్జెట్
-
Feb 14, 2026 10:29 IST
అమరావతి: అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్
ఛాంబర్‌లో బడ్జెట్ ప్రతులకు మంత్రి పయ్యావుల పూజలు.
బడ్జెట్ ప్రతులతో మంత్రివర్గ సమావేశానికి పయ్యావుల.
బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్న కేబినెట్.
-
Feb 14, 2026 10:29 IST
అమరావతి: మంత్రి పయ్యావుల నివాసంలో ఆర్థిక శాఖ అధికారులు
బడ్జెట్ ప్రతులకు మంత్రితో కలిసి అధికారులు పూజా కార్యక్రమాలు.
బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయల్దేరిన మంత్రి పయ్యావుల కేశవ్.

-
Feb 14, 2026 10:28 IST
విజయవాడ: ఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న అధికారులు.
బడ్జెట్ ప్రతులకు పూజలు చేయించిన ఆర్థిక శాఖ అధికారులు.
-
Feb 14, 2026 09:57 IST
అమరావతి: అభివృద్ధి-సంక్షేమం సమతూకంతో బడ్జెట్ రూపకల్పన
ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు లబ్ధి కలిగేలా బడ్జెట్ పద్దు.
-
Feb 14, 2026 09:56 IST
మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల
ఇప్పటికే ఒకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల.
పూర్తిస్థాయిలో ఒకసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ఆర్థిక మంత్రి
2026-27 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌కు కసరత్తు పూర్తి.
-
Feb 14, 2026 09:52 IST
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ.
ఏపీ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్న మంత్రివర్గం.
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల.
వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు.
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి వంగలపూడి అనిత.
మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.