కర్నూలు జిల్లాలో 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టు
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:23 AM
కర్నూలు జిల్లాలో 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మిగనూరు మండలంలో విండోరా ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.
ఏలూరు, చిత్తూరు జిల్లాల్లో సీబీజీ ప్లాంట్లు
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మిగనూరు మండలంలో విండోరా ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో రోజుకు 10 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్(సీబీజీ ప్లాంట్) ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్లాంటును ఆంధ్ర షుగర్స్ ఏర్పాటు చేయనుంది. అలాగే చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో రోజుకు 12 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేయడానికి ఐరా బయో ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!