Share News

జూలై 15 నాటి జాబితాను పరిగణనలోకి తీసుకోండి

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:31 AM

స్థానిక సంస్థల ఎన్నికల తుది ఓటర్ల జాబితా రూపకల్పన విషయంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

జూలై 15 నాటి జాబితాను పరిగణనలోకి తీసుకోండి

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల తుది ఓటర్ల జాబితా రూపకల్పన విషయంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూలై 15 వరకు అప్‌డేట్‌ చేసిన ఓటర్ల జాబితాలను పరిగణనలోకి తీసుకొనేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. ఓటర్లు తమ పేర్లను సరిచూసుకోవడానికి, లోపాలను సవరించుకోవడానికి తగినంత సమయం ఇస్తూ ఓటర్ల జాబితా ప్రచురణకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేయాలని తెలిపింది. ఈ మేరుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 04:31 AM