Share News

ఏపీఎఫ్‌డీసీకి ‘ప్రమాణ్‌’ గుర్తింపు

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:11 AM

పర్యావరణహిత అటవీ నిర్వహణ, కలప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అరుదైన ఘనత సాధించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్‌ ఫారెస్ట్‌ అండ్‌ వుడ్‌ సర్టిఫికేషన్‌ స్కీమ్‌’ కింద తొలి ‘ప్రమాణ్‌’ ధ్రువీకరణ పత్రాన్ని అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీఎఫ్‌డీసీ) దక్కించుకుంది.

ఏపీఎఫ్‌డీసీకి ‘ప్రమాణ్‌’ గుర్తింపు

  • దేశంలోనే అరుదైన ఘనత దక్కించుకున్న ఏపీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పర్యావరణహిత అటవీ నిర్వహణ, కలప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అరుదైన ఘనత సాధించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్‌ ఫారెస్ట్‌ అండ్‌ వుడ్‌ సర్టిఫికేషన్‌ స్కీమ్‌’ కింద తొలి ‘ప్రమాణ్‌’ ధ్రువీకరణ పత్రాన్ని అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌(ఏపీఎఫ్‌డీసీ) దక్కించుకుంది. దేశలోనే తొలిసారిగా ఏపీకి ఈ గుర్తింపు దక్కడం గమనార్హం. మంగళవారం, ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఈ సర్టిఫికెట్‌ను ఏపీ అధికారులకు అందజేశారు. రాష్ట్రంలో ఏపీఎఫ్‌డీసీ పరిధిలో ఏకంగా 33 వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న తోటల్లో అటవీ పెంపకం, నిర్వహణ తీరుపై సమగ్ర తనిఖీలు నిర్వహించి ఈ సర్టిఫికేషన్‌ను ఖరారు చేశారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 06:11 AM