Share News

నిందితులతో పరేడ్లు వద్దని ఆదేశించాం

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:38 AM

వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను వీధుల్లో నడిపిస్తూ పరేడ్‌ నిర్వహించడం, మీడియా ముందు ప్రవేశపెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు...

 నిందితులతో పరేడ్లు వద్దని ఆదేశించాం

  • జిల్లాల ఎస్పీలకు డీజీపీ సర్క్యులర్‌ ఇచ్చారు: ఎస్‌జీపీ

  • వివరాలు నమోదు చేసిన హైకోర్టు.. పిల్‌ మూసివేత

అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను వీధుల్లో నడిపిస్తూ పరేడ్‌ నిర్వహించడం, మీడియా ముందు ప్రవేశపెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) యతీంద్రదేవ్‌ వాదనలు వినిపిస్తూ... సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నిందితులతో పరేడ్‌ నిర్వహించిన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కోర్టు ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలని, నిందితులతో పరేడ్‌ చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది సెప్టెంబరు 18న అన్ని జిల్లా ల ఎస్పీలకు డీజీపీ సర్క్యులర్‌ ఇచ్చారన్నారు.

కోర్టు ఆదేశాలు ఉల్లంఘించామన్న పిటిషనర్‌ ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. డీజీపీ ఇచ్చిన సర్క్యులర్‌పై పిటిషనర్‌ తరఫు న్యాయవాది సైతం సం తృప్తి వ్యక్తం చేయడంతో ఏజీపీ చెప్పిన వివరాలు నమోదు చేసిన ధర్మాసనం పిల్‌పై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది.

నిందితులను వీధుల్లో నడిపిస్తూ పరేడ్‌ నిర్వహించడంతోపాటు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాపర్టీ, ఎన్విరాన్‌మెంటల్‌ సంస్థ అధ్యక్షుడు పరసా సురేశ్‌కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ పిల్‌పై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం

ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు

Updated Date - Nov 13 , 2026 | 01:39 AM