పొగాకు వాడకంతో దృఢత్వాన్ని కోల్పోతారు
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:57 PM
పొగాకు ఉత్పత్తుల వినియోగంతో శరీర దృఢత్వాన్ని కోల్పోతారని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీరాములు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జేఎనటీయూలో క్రీడాకారులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతపురం వైద్యం, జూన 6(ఆంధ్రజ్యోతి): పొగాకు ఉత్పత్తుల వినియోగంతో శరీర దృఢత్వాన్ని కోల్పోతారని జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీరాములు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జేఎనటీయూలో క్రీడాకారులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సిగరెట్, పాన తదితర రూపాల్లో పొగాకు ఉత్పత్తులు లభిస్తున్నాయన్నారు. సరదాకోసం ప్రారంభించి వ్యసనపరులుగా మారే ప్రమాదముంటుందన్నారు. తద్వారా శరీర దృఢత్వాన్ని కోలోవడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు బారినపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంకారావు, అంజనేయులు, శ్రీనివాసులు, విజయ్, ప్రకాష్, జగన, కిశోర్, శివశంకర్, జయపాల్, రాజునాయక్ పాల్గొన్నారు.