Share News

వైసీపీ మాదిరిగా పార్టీలు చూడం

ABN , Publish Date - May 29 , 2026 | 11:27 PM

వైసీపీ పాలనలో మాదిరిగా పార్టీలు చూడమని, అర్హత ఉంటే ఎలాంటి సంక్షేమ పథకమైనా అందుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

వైసీపీ మాదిరిగా పార్టీలు చూడం
MLA Daggupati Prasad receiving petitions from the people

అనంతపురం అర్బన, మే 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో మాదిరిగా పార్టీలు చూడమని, అర్హత ఉంటే ఎలాంటి సంక్షేమ పథకమైనా అందుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వయంగా స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీటిలో కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇప్పటిదాకా 45 గ్రీవెన్సల్లో 1026 అర్జీలు వచ్చాయని, వీటిలో 997 అర్జీలు పరిష్కరించామన్నారు. మిగిలిన అర్జీలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కొన్ని కోర్టు సమస్యలతో పరిష్కరించలేని పరిస్థితి ఉందని..వీటిని స్పష్టంగా అర్జీదారులకు తెలియజేశామన్నారు. గత వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. టీడీపీ సానుభూతిపరులకు అనేక సంక్షేమ పథకాలు అందకుండా చేశారని, పార్టీల పేరుతో వివక్ష చూపారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా పార్టీలకు అతీతంగా అర్హత ఉంటే కచ్చితంగా అందుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

Updated Date - May 29 , 2026 | 11:27 PM