Share News

ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నాం

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:56 PM

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటివెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. శుక్రవారం అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్‌ నిర్వహించారు. నగరంలోని పలు కాలనీల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకోవడంతోపాటు అర్జీలు సమర్పించారు.

ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్నాం
MLA Daggupati receiving petitions from the people

అనంతపురం అర్బన, జూన 5(ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటివెంకటేశ్వరప్రసాద్‌ అన్నారు. శుక్రవారం అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్‌ నిర్వహించారు. నగరంలోని పలు కాలనీల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకోవడంతోపాటు అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటిదాకా 46 సార్లు ప్రజా దర్బార్‌ నిర్వహించామన్నారు. 1072 అర్జీలు రాగా, 1025 సమస్యలు పరిష్కరించామన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కూటమి పాలనలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్లస్టర్‌, యూనిట్‌, బూతల మేరకు తమ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారన్నారు. అందుకే తమ కార్యాలయానికి తక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటిలో కూడా ఎక్కువగా పింఛన్లు, ఇళ్ల సమస్యలు చెబుతున్నారని.. త్వరలోనే అవి మంజూరవుతాయన్నారు. స్వచ్ఛంద కార్పొరేషన డైరెక్టర్‌ భవాని రవికుమార్‌, డైరెక్టర్లు పీఎల్‌ఎనమూర్తి, పరమేశ్వర్‌, కడియాల కొండన్న పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2026 | 11:56 PM