MLA SUNITHA : కార్యకర్తలకు అండ టీడీపీ
ABN , Publish Date - May 24 , 2026 | 12:17 AM
ప్రజలకు, కార్యకర్తలకు కష్టం వచ్చిందంటే తక్షణమే స్పందించేది తెలుగుదేశంపార్టీ అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక అతిథిగృహంలో శనివారం రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీచేశారు.
రామగిరి, మే 23(ఆంధ్రజ్యోతి): ప్రజలకు, కార్యకర్తలకు కష్టం వచ్చిందంటే తక్షణమే స్పందించేది తెలుగుదేశంపార్టీ అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక అతిథిగృహంలో శనివారం రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ.14 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీచేశారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సునీతకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 23నెలల్లో 1290 మందికి రూ.9.82కోట్ల మేర సహాయం అందిచారన్నారు. సైకో పాలనలో ఏనాడూ ప్రజలకు సాయం అందించిన పాపాన పోలేదన్నారు.
మహానాడును విజయవంతం చేయాలి: ఈనెల 27,28 తేదీలలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈ సారి వర్చ్యువల్‌గా మహానాడు ఉంటుందని, ప్రతి క్లస్టర్ పరిధిలో కార్యకర్తలు పాల్గొనాలన్నారు. మండల నాయకులు, క్లస్టర్ ఇనచార్జ్‌లు ప్రత్యేక చొరవ తీసుకుని ఎల్‌ఈడీ స్ర్కీన్లుఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలన్నారు. రామ్మూర్తినాయుడు, సుధాకర్‌చౌదరి, సుధాకర్, యాతంపోతలయ్య, మంగాపురం ముత్యాలు, ఆవుల ముత్యాలు, అక్కులప్ప, నాగేశంనాయుడు, ఈడిగ శ్రీనివాసులు, పేపర్‌శీన, చిత్తరంజన, బ్రహ్మ, గంగిరెడ్డి, విశ్వనాథ్, ఆంజనేయులు పాల్గొన్నారు.
చెరువుకట్ట మరమ్మతు పనులు పూర్తిచేయాలి
కనగానపల్లి: మండల కేంద్రంలోని రెడ్డివారికుంట చెరువు మరమ్మతు పనులు త్వరతగిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రెండేళ్లక్రితం కురుసిన భారీ వర్షానికి చెరువుకట్ట తెగిన విషయం తెలిసిందే. చెరువు మరమ్మతులకు ఎమ్మెల్యే డీఎంఎఫ్ గ్రాంట్ ద్వారా రూ.86లక్షలు మంజూరు చేయించారు. పనులను శనివారం ఆమె పరిశీలించి త్వరతగిన పూర్తిచేయాలన్నారు. పనులను నాణ్యతగా చేపట్టాలని, పనులు పూర్తి అయిన అనంతరం హాంద్రీనీవా కాలువ ద్వారా చెరువు నింపుతాన్నారు. అనంతరం ఆమె తగరకుంటలో టీడీపీ నాయకుడు బసినేపల్లి క్రిష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల క్రిష్ణారెడ్డి భార్య సీతమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. ఎమ్మెల్యే బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆమె వెంట రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన బోయపాటి సుధాకర్ చౌదరి, మండల కన్వీనర్ యాతం పోతలయ్య, మాజీ సర్పంచులు అంకె రామక్రిష్ణ, మాధవరాజు, స్వాతి, వన్నూరప్ప, శ్రీనాథ్‌చౌదరి, సూరి, బొమ్మయ్య పాల్గొన్నారు.