Share News

అన్నదాతలను ఆదుకోండి

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:45 PM

అనంత రైతాంగాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్‌ చేశారు. అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, సీపీఐ నేతలు రైతులతో క లిసి సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు.

అన్నదాతలను ఆదుకోండి
Leaders of the farmers' association protesting at the collectorate

అనంతపురం విద్య, జూన 1(ఆంధ్రజ్యోతి): అనంత రైతాంగాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి మల్లికార్జున డిమాండ్‌ చేశారు. అన్నదాతలను ఆదుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, సీపీఐ నేతలు రైతులతో క లిసి సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఖరీప్‌ సీజన ఆరంభంమవుతున్నా ఇప్పటికీ విత్తనం, ఎరువులు అందుబాటులోకి తేలేదన్నారు. ముందస్తు వర్షాలతో రైతులు సాగుపనులు చేపడతుఉన్నా విత్తనాలులేక ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. విత్తన ఏజెన్సీలకు ఇప్పటికీ విత్తనం సరఫరా చేయలేదన్నారు. బకాయిలుచెల్లించకపోవడం వల్లనే ఏజెన్సీలు విత్తనకాయలు సరఫరా చేయడం లేదనే ప్రచారం సాగుతోందన్నారు. అదే నిజమైతే వెంటనే బిల్లులు చెల్లించి విత్తనకాయలను అందుబాటులోకి తేవాలన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో జేసీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నప్పయాదవ్‌, నాయకులు వన్నారెడ్డి, నారాయణస్వామి, వెంకటరాముడు, రామాంజనేయులు, రామక్రిష్ణ, రమేష్‌, ఓబిరెడ్డి, నరేష్‌, దుర్గాప్రసాద్‌, మధు, శ్రీకాంత, గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 11:45 PM