Share News

ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:39 PM

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో బీజేపీ నాయకులు కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలి
Strict action should be taken against the BJP leaders speaking at the Food Colloquium auditorium.

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 22(ఆంధ్రజ్యోతి): ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆహార కల్తీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారవేదికలో బీజేపీ నాయకులు కలెక్టర్‌ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌ మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహించే జనతావారధిలో ప్రజల నుంచి అత్యధికంగా కల్తీ ఆహారం, ఆహారభద్రతా సంక్షోభంపై వినతులు వస్తున్నాయని తెలిపారు. ఆహారభద్రత, ఫుడ్‌సేప్టీ వ్యవస్థలను బలోపేతం చేసి మాంసం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేసి కల్తీ ఆహారాన్ని నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సలో కమిషనర్‌ జస్వంతరావును కలిసి వినతిపత్రం అందజేశారు. జనతావారధి కన్వీనర్‌ నాగేంద్రకుమార్‌, యువమోర్చా అఽధ్యక్షుడు తేజేశ్వర్‌ రెడ్డి, దామోదర్‌, ప్రసాద్‌, కేశవనాయక్‌, గణేష్‌, బ్రహ్మయ్య ఆచారి, నరేంద్రయాదవ్‌, రాజేంద్ర, కృష్ణ, రాందాస్‌, జిలాన బాషా పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 11:39 PM