MLA JAYARAM: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:53 PM
సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి కార్యక్రమం వేగవంతమైందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం మధ్యాహ్నం మండలంలోని పాతకొత్తచెరువు గ్రామంలో రూ.22 లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.
గుంతకల్లు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి కార్యక్రమం వేగవంతమైందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం మధ్యాహ్నం మండలంలోని పాతకొత్తచెరువు గ్రామంలో రూ.22 లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయిన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ పల్లెపండుగ-2.0 కింద రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి పభుత్వం నియోజకవర్గానికి రూ.17.25 కోట్ల నిధులను కేటాయించిందన్నారు. మొదటి విడతలో రూ.6.25 కోట్లు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పీఆర్ డీఈఈ మురళీధర్, ఎంపీడీఓ దేవదాస్, టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, తలారి మస్తానప్ప, హిమబిందు, రామన్న చౌదరి, యుగంధర్ పాల్గొన్నారు. మండలంలోని ఎన కొట్టాల గ్రామంలో టీడీపీ కార్యకర్త చాంద్‌బాషా మృతిచెందడంతో ఎమ్మెల్యే ఆ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు.
మహిళలకు వరం సఖి సురక్ష: ప్రభుత్వం ప్రవేశపెట్టిన సఖి సురక్ష పథకం మహిళలకు వరమని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం ఉదయం పట్టణంలోని పరిటాల శ్రీరాములు కల్యాణ మండపంలో సఖి సురక్ష పథకం కింద పొదుపు మహిళలకు ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆరో గ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసిందన్నారు. అనంతరం ఆయుష్మాన భారత డిజిటల్ మిషన కింద వచ్చిన ప్రత్యేక హెల్త్ కార్డులను ఆయన పంపిణీచేశారు. నాయకులు హనుమంతు, ఫజులు, మహమ్మద్ ఖాజా, రామప్ప, కేశప్ప పాల్గొన్నారు.