Share News

సర్‌పై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:45 PM

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ(సర్‌) నేపథ్యంలో ఓట్ల కూర్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్‌ యాదవ్‌ సూచించారు. బుధవారం అర్బన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

సర్‌పై అప్రమత్తంగా ఉండాలి
Sudhakar Yadav, who is speaking, leaders

అనంతపురం క్రైం, జూన 8(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ(సర్‌) నేపథ్యంలో ఓట్ల కూర్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్‌ యాదవ్‌ సూచించారు. బుధవారం అర్బన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ విజయవంతం చేయండం లో క్లస్టర్‌ ఇనచార్జులు, యూనిట్‌ ఇనచార్జులు, బూత ఇనచార్జులు కీ లకపాత్ర పోషించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదయ్యేలా చూడటంతోపాటు, జాబితాలో లోపాలు ఉంటే సరిదిద్దేలా సర్‌ ప్రక్రియలో పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలన్నారు. అర్హులందరూ జాబితాలో ఉండేలా దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఫిరోజ్‌ అహ్మద్‌, సాకే లక్ష్మీనరసింహ, పొట్లూరి కేశవనాయుడు, కృష్ణం రఘు, దాడి రమేష్‌, నెట్టెం బాలకృష్ణ, ఖాదర్‌ వలి, ముఖేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 11:45 PM