ప్రాణాలు కాపాడే సేవకులు రక్తదాతలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:04 AM
ప్రాణాప్రాయంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడే నిస్వార్థ సేవకులు రక్తదాతలు అని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయశ్రీ అన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవానికి పురస్కరించుకుని సర్వజన వైద్యశాలలోని రక్తనిధి కేంద్రంలో శనివారం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపురం వైద్యం, జూన 13(ఆంధ్రజ్యోతి): ప్రాణాప్రాయంలో ఉన్నవారి ప్రాణాలు కాపాడే నిస్వార్థ సేవకులు రక్తదాతలు అని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ విజయశ్రీ అన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవానికి పురస్కరించుకుని సర్వజన వైద్యశాలలోని రక్తనిధి కేంద్రంలో శనివారం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేథాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ శివశంకర నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వైద్యశాలలో నిత్యం 20కిపైగా ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడుతూ వస్తున్నారన్నారన్నారు. వారికి ఒకటి నుంచి మూడు యూనిట్ల రక్తాన్ని ఎక్కించి ప్రసవం చేయాల్సివస్తోందన్నారు. తలసేమియా, హిమోఫీలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, ప్రమాదాల్లో గాయపడిన వారికి, శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి రక్తం చాలా అవసరమన్నారు. రోజుకు 30నుంచి 50కిపైగా యూనిట్ల రక్తాన్ని బాధితులకు ఎక్కించి వైద్య సేవలందిస్తున్నారన్నారు. వారి ప్రాణాలను కాపాడేందుకు ముందుకువస్తూ రక్తదానం చేస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యవంతమైన ప్రతిఒక్కరూ పెద్దాస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌కు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. కళాశాల, వైద్యశాలలోని అనేకమంది డాక్టర్లు, సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని పీడియాట్రిక్స్ సర్జరీ విభాగం డాక్టర్ స్వాతి ఏడుసార్లు రక్తదానం చసిందని ప్రశంసించారు. అనంతరం రక్తదానం చేసిన 61మంది ఆస్పత్రి సిబ్బందికి సర్టిఫికెట్స్ అందించి అభినందించారు. డాక్టర్లు లక్ష్మి, భవాని, శ్రావణి, దివ్య, లలిత, సిబ్బంది సుజాత, భారతి రమణారెడ్డి, మురళీమోహన, పవన, మహేష్ పాల్గొన్నారు.