Share News

పారిశుధ్య సిబ్బంది యాప్రాన ధరించాలి

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:54 PM

నగరంలో పారిశుధ్య సిబ్బంది విధులలో కచ్చితంగా యాప్రాన ధరించాల్సిందేనని నగరపాలక సంస్థ కమిషనర్‌ జస్వంతరావు ఆదేశించారు. శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్‌హాల్‌లో పారిశుధ్యం మెరుగునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

పారిశుధ్య సిబ్బంది యాప్రాన ధరించాలి
Commissioner Jaswanth Rao talking

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 20(ఆంధ్రజ్యోతి): నగరంలో పారిశుధ్య సిబ్బంది విధులలో కచ్చితంగా యాప్రాన ధరించాల్సిందేనని నగరపాలక సంస్థ కమిషనర్‌ జస్వంతరావు ఆదేశించారు. శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్‌హాల్‌లో పారిశుధ్యం మెరుగునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు శానిటేషన సిబ్బంది ఉదయం 5.30 నుంచి 10.30గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు రెండు షిఫ్టుల్లో విధుల్లో ఉండాలన్నారు. ప్రతి శానిటేషన సిబ్బంది గుర్తింపునకు యాప్రాన ధరించాలన్నారు. నిర్లక్ష్యం, గైర్హాజరులు ఉపేక్షించబోమని, మీకు బాధ్యత లేదా, ఈ వ్యవస్థను మార్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి గైర్హాజరైన 17మంది స్వర్ణవార్డు సచివాలయం సెక్రటరీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీ కాలుష్యనియంత్రణ మండలి ఈఈ శశికళ మాట్లాడుతూ ప్లాస్టిక్‌, చెత్త డంపింగ్‌, డ్రైనేజీ కాలువలు శుభ్రంగా ఉంచాలన్నారు. నగరంలో ప్లాస్టిక్‌ నిషేధం కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఇనచార్జి ఎంహెచవో సునీత, శానిటేషన ఇనస్పెక్టర్లు ఆంజనేయులు, గణేనాయక్‌, నాగరాజు, శివయ్య, గోపాల్‌, విజయ్‌కుమార్‌, శానిటేషన సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:54 PM