Share News

పోరాటానికి తగ్గ ఫలితం దక్కింది

ABN , Publish Date - May 25 , 2026 | 11:56 PM

వైసీపీ ప్రభుత్వ హ యాంలో పట్టాలు ఇచ్చిన భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడుకునేందుకు చేసిన పోరాటం ఫలించిందని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బీసీఆర్‌ దాస్‌ అన్నారు.

పోరాటానికి తగ్గ ఫలితం దక్కింది
MRPS leaders inaugurating the Mandakrishna Madiga Colony board

అనంతపురం రూరల్‌, మే 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హ యాంలో పట్టాలు ఇచ్చిన భూమిని ఆక్రమణదారుల నుంచి కాపాడుకునేందుకు చేసిన పోరాటం ఫలించిందని ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బీసీఆర్‌ దాస్‌ అన్నారు. సోమవారం పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో మందకృష్ణ మా దిగ కాలనీ బోర్డును ఏర్పాటు చేసి ప్రారంభించారు. దాస్‌ మాట్లాడుతూ రూరల్‌ మండలం కురుగుంట గ్రామ సర్వే నంబరు 41-1లో 300మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. గత ఏడాది అక్టోబరులో జరిగిన ఎస్సీ ఎ స్టీ విజిలెన్స మానింటరింగ్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ భూమిలో లేవుట్‌ వేసి ప్లాట్లు విభజించి లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పారన్నారు. తహసీల్దార్‌ తమతో సమావేశం నిర్వహించి సర్వేయర్‌తో పనిచేయించారన్నారు. అమర్‌, ఆది, హరి, సూరి, శివ, దొడ్డప్ప, రాజు, శేఖర్‌, రామాంజి, శివయ్య, కొండయ్య, సోము, కోటప్ప, నాగమ్మ పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 11:57 PM