Provide water కుడికాలువ కింది చెరువులన్నింటికీ నీరివ్వండి
ABN , Publish Date - Feb 03 , 2026 | 01:16 AM
రాప్తాడు నియోజకవర్గంలో పీఏబీఆర్ కుడికాలువ పరిధిలోని అన్ని చెరువులకు నీరు ఇవ్వాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె పీఏబీఆర్ ఎస్‌ఈ, ఏఈలు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
అనంతపురం క్రైం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రాప్తాడు నియోజకవర్గంలో పీఏబీఆర్ కుడికాలువ పరిధిలోని అన్ని చెరువులకు నీరు ఇవ్వాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె పీఏబీఆర్ ఎస్‌ఈ, ఏఈలు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
జలాశయం నుంచి నీళ్లు వదిలి 15 రోజులు దాటినా... ప్రవాహం సరిగ్గా లేదన్నారు. ఇంత తక్కువ ప్రవాహంతో నీరు వెళితే... చివరి చెరువులకు ఎప్పుడు చేరతాయని ప్రశ్నించారు. నీటి వేగాన్ని పెంచాలని గత వారం చెప్పినా... నేటికీ అదే ప్రవాహం ఉందన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని చెరువులకు గత కొన్నేళ్లుగా నీరు సరిగ్గా రావడం లేదన్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో 50 శాతం నుంచీ 75 శాతం చెరువులకు నీరు నింపాలన్నారు. అవసరమైతే...ఉన్నతాధికారులతో మాట్లాడతానని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ పనులు కూడా వెంటనే పూర్తిచేయాలని, కొత్త పనులు మొదలెట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. తర్వాత నియోజకవర్గ పరిధిలోని 26 మందికి 41.95 లక్షల మేర సీఎం రిలీ్‌ఫఫండ్ మంజూరవగా.. అందుకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే ఆయా లబ్ధిదారులకు అందజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..