Share News

MLA SUNITHA: జలధారకు ప్రణాళికలు సిద్ధం చేయండి

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:07 AM

జలధార పథకం కింద చేపట్టే పనులపై 10రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన అధికారులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. సోమవారం స్థానిక పంచాయతీ రాజ్‌ శాఖ అతిథి గృహంలో ఇరిగేషన శాఖ అధికారులతో జలధార పథకంపై సమీక్ష నిర్వహించారు.

MLA SUNITHA: జలధారకు ప్రణాళికలు సిద్ధం చేయండి
MLA Paritala Sunita discussing with irrigation officials

రామగిరి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): జలధార పథకం కింద చేపట్టే పనులపై 10రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన అధికారులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. సోమవారం స్థానిక పంచాయతీ రాజ్‌ శాఖ అతిథి గృహంలో ఇరిగేషన శాఖ అధికారులతో జలధార పథకంపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ఎలాంటి పనులు చేయాలన్న ఆంశాల గురించి చర్చించారు. చెరువుల మరమ్మతులు, పటిష్టతకు తొలిప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇరిగేషన అధికారులు జలధార ఇనచార్జి, పంచాయతీ కార్యదర్శి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌, గ్రామ పంచయాతీ ప్రత్యేక అధికారులతో కలిసి పనులను గుర్తిస్తామని అధికారులు వివరించారు. అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. గ్రామంలో చేపట్టే ప్రతిపని రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. సాగునీటి సంఘా లు, రైతులు, గ్రామప్రజల సహకారంతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా జలధార కార్యక్రమాన్ని చేపట్టారని, వీటి ఫలితాలు వచ్చే వర్షాకాలంలో కనిపించాలన్నారు. ఎక్కడ పనిచేసినా వృథా కాకూడదని, కచ్చితమైన ప్రణాళకతో ఫలితాలు రావాలన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:07 AM