Share News

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంత

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:51 PM

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంతపురం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక కొవ్వూరునగర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్‌, అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే చీపురు పట్టి..చెత్త ఊడ్చి రోడ్లను శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఇంటింటా పరిశుభ్రతపై పోస్టర్లు అతికిస్తూ స్వచ్ఛ అనంత కోసం కట్టుబడి ఉంటామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంత
The MLA and the Commissioner are cleaning the streets with a broom.

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 20 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంతపురం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక కొవ్వూరునగర్‌లో నగరపాలక సంస్థ కమిషనర్‌, అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే చీపురు పట్టి..చెత్త ఊడ్చి రోడ్లను శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఇంటింటా పరిశుభ్రతపై పోస్టర్లు అతికిస్తూ స్వచ్ఛ అనంత కోసం కట్టుబడి ఉంటామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. కాలనీల్లో కలియతిరుగుతూ డ్రైనేజీ కాలవలు, రోడ్లు పరిశీలిస్తూ ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ కాలుష్యనియంత్రణ మండలి ఈఈ శశికళ, ఎంహెచవో సునీత, మాజీ కార్పోరేటర్లు రాజారావు, బాలాంజినేయులు, స్వచ్ఛ సర్వేక్షణ్‌ టీం లీడర్‌ వెంకటేష్‌, శానిటేషన పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:51 PM