ఏ ఓటరుకూ అన్యాయం జరక్కూడదు
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:59 PM
అర్హులైన ఏ ఓటరుకూ అన్యాయం జరక్కూడదని, అక్రమ ఓట్లపైనా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పార్టీ నేతలను ఆదేశించారు. శనివారం అర్బన కార్యాలయంలో ఆయన పార్టీ క్లస్టర్ ఇనచార్జులు, యూనిట్, డివిజన ఇనచార్జులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
అనంతపురం క్రైం, జూన 13(ఆంధ్రజ్యోతి): అర్హులైన ఏ ఓటరుకూ అన్యాయం జరక్కూడదని, అక్రమ ఓట్లపైనా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పార్టీ నేతలను ఆదేశించారు. శనివారం అర్బన కార్యాలయంలో ఆయన పార్టీ క్లస్టర్ ఇనచార్జులు, యూనిట్, డివిజన ఇనచార్జులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఎల్‌ఏ దగ్గర నుంచి క్లస్టర్, యూనిట్ ఇనచార్జుల వరకూ ప్రతి ఒక్కరూ సర్‌పై అవగాహన పెంచుకోవడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. 15వ తేదీ నుంచి బీఎల్‌ఓలు ఇంటింటి సర్వే ఉంటుందన్నారు. 285 బూతలలో ప్రతి బూత లెవల్ ఏజెంట్ భాగస్వామి కావాలన్నారు. ఎస్‌ఐఆర్‌తో చేసే ప్రతి కార్యక్రమాన్ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిశీలిస్తారని, ఎక్కడా నిర్లక్ష్యం చూపకుండా పనిచేయాలన్నారు. సుధాకర్ యాదవ్, ఫిరోజ్ అహ్మద్, బుగ్గయ్య చౌదరి, సరిపూటి రమణ, డిష్ నాగరాజు, సాకే లక్ష్మీనరసింహ, రాజారావు, చేపల హరి, కాయగూరల శ్రీధర్, వన్నూరప్ప, దళవాయి వెంకటనారాయణ, పొట్లూరి కేశవనాయుడు, గోపాల్ గౌడ్ పాల్గొన్నారు.
అభివృద్ధి చూసి ఓర్వలేక విమర్శలు: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారంటూ ఎమ్మెల్యే మండిపడ్డారు. అర్బన కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలతో అర్జీలు స్వీకరించిన ఆ యన పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఇప్పటి వ ర కూ 1088 అర్జీలు వస్తే 1027 సమస్యలకు పరిష్కారం చూపినట్టు తెలిపారు.