సమస్యల పరిష్కారం కోసం పోరాడుదాం
ABN , Publish Date - May 24 , 2026 | 11:59 PM
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని ఎనఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్‌నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక పీవీకేకే కళాశాల సమావేశపు హాల్‌లో ఎనఎంయూఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.
అనంతపురం అర్బన, మే 24(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని ఎనఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్‌నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక పీవీకేకే కళాశాల సమావేశపు హాల్‌లో ఎనఎంయూఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భాస్కర్‌నాయుడు మాట్లాడుతూ వచ్చే డిసెంబర్‌లో జరిగే కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు సంఘం తరఫున ప్యానల్ సిద్ధం చేసుకొని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మహిళా శక్తి బస్సుల్లో జీరో టికెట్లు ఇచ్చే విధానాన్ని అమలు చేసి, మిగతా ప్రయాణికులకు మాత్రమే టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సంఘం జోనల్ సంయుక్త కార్యదర్శి డీఎన రెడ్డి, జిల్లా చైర్మన సూరిబాబు, కార్యదర్శి ప్రతా్‌పనారాయణ, అనంతపురం డిపో అధ్యక్షుడు ఆర్‌ఎన రెడ్డి, నాయకులు స్వామి, రామాంజనేయులు, శ్రీనివాసులు, ఓబయ్య పాల్గొన్నారు.