పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు.. దీక్ష విరమించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
ABN , Publish Date - Jun 12 , 2026 | 06:00 PM
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష విరమించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 196(1)BNS సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం, జూన్12: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష విరమించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 196(1)BNS సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ సదరు వైసీపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీక్ష విరమించిన అనంతరం జేసీ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఎదుట తమ సమస్య తేల్చుకుంటామన్నారు.
సోమవారం ఎస్పీ కార్యాలయంకు అనుచరులతో కలిసి వెళ్తామని చెప్పారు. ఈ ఆందోళనకు.. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని కుండబద్దలు కొట్టారు. కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డితోపాటు అనుచరులు మాత్రమే వెళ్తామని చెప్పారు. తాడిపత్రిలో తాము ఉండాలా? లేదా అనేది ఎస్పీని అడుగుతామని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు
రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ
Read Latest AP News And Telugu News