Share News

MLA SRAVNI: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:11 AM

ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహించినట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. మండలంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు.

MLA SRAVNI: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌
MLA Bandaru Shravana Shree is speaking

నార్పల, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహించినట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. మండలంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలన్నారు. సాగు, తాగునీటి సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికల శుభ్రత, ప్రహ రీ నిర్మాణం తదితర అంశాలపై అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. తాగునీటి సమస్యపై సమ్మర్‌ యాక్షన ప్లాన రూపొందించి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. టీడీపీ జిల్లా నాయకులు ఆలం వెంకటనరసనాయుడు, ఎంపీడీవో మమతాదేవి, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, మండల కన్వీనర్‌ బండ్లపల్లి కుళ్లాయప్ప, సొసైటీ చైర్మన ఉమామహేశ్వర నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:11 AM