రెండేళ్లలో రూ.6.04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం
ABN , Publish Date - Jun 06 , 2026 | 11:55 PM
కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అనంతపురం అర్బనలో ప్రజలకు రూ.6.04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.
అనంతపురం క్రైం, జూన 6(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అనంతపురం అర్బనలో ప్రజలకు రూ.6.04 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. శనివారం అర్బన కార్యాలయంలో ఆయన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. 8 మంది లబ్ధిదారులకు రూ.12.56 లక్షల చెక్కులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదవాడి ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చడంతోపాటు, అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారికి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందిస్తోందన్నారు. పేదల ఆరోగ్యం విషయంలో ఉదారంగా ఉన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశకు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలన్నారు.