గుంజేపల్లికి హెచ్చెల్సీ నీరు ఇవ్వాలి
ABN , Publish Date - May 26 , 2026 | 12:01 AM
నార్పల మండలం గుంజేపల్లి గ్రామానికి హెచ్చెల్సీ నీరు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్‌ఎ్‌సలో కలెక్టర్ ఆనంద్‌ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతపురం క్లాక్‌టవర్, మే 25(ఆంధ్రజ్యోతి): నార్పల మండలం గుంజేపల్లి గ్రామానికి హెచ్చెల్సీ నీరు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్‌ఎ్‌సలో కలెక్టర్ ఆనంద్‌ను నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళుగా సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్న గుంజేపల్లి గ్రామానికి నీటి వసతి కల్పించాలన్నారు. గ్రామంలో ప్రజలు, రైతుల భాగస్వామ్యంతో చెరువును పూర్తి చేసుకున్నారన్నారు. వెంటనే హెచ్చెల్సీ నీటిని అందించి గ్రామాన్ని ఆదుకోవాలని కోరారు. కుమారస్వామి, ఆనంద్, అయ్యన్న, నాగేంద్రకుమార్, మల్లారెడ్డి, తేజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రధాని మోదీ పంచసూత్రాలను అమలు చేయాలి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన పంచసూత్రాలను అమలు చేసి ప్రజలకు బాధ్యాతాయుత జీవనవిధానంపై అవగాహన కల్పించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో జరిగిన పీజీఆర్‌ఎ్‌సలో జేసీ విష్ణుచరణ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రారంభించిన జనతావారధికి ప్రజల నుంచి విశేషస్పందన వస్తోందన్నారు. జనతావారధి కన్వీనర్ నాగేంద్రకుమార్, రత్నమయ్య, మల్లారెడ్డి, ఈశ్వర్‌ప్రసాద్, అయ్యన్న, తేజేశ్వర్‌రెడ్డి, అజేష్, లక్ష్మణ్‌గౌడ్, దామోదర్, ప్రసాద్, సురేంద్ర, మల్లికార్జున, నరేంద్ర, దిలీప్, ఓబుళేసు, ఆనంద్, రాజేంద్ర, కాటమయ్య పాల్గొన్నారు.