Share News

ప్రకృతి వ్యవసాయంతోనే ప్రజలకు ఆరోగ్యం

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:53 PM

ప్రకృతి వ్యవసాయంతోనే పజ్రల ఆరోగ్యానికి రక్ష అని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపును అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌ అన్నారు. పీఎం 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా శనివారం రెడ్డిపల్లి కృషి విజ్ఞానకేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్రకృతి వ్యవసాయంతోనే ప్రజలకు ఆరోగ్యం
Konakondla Rajesh who is talking

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 20(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంతోనే పజ్రల ఆరోగ్యానికి రక్ష అని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపును అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్‌ అన్నారు. పీఎం 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా శనివారం రెడ్డిపల్లి కృషి విజ్ఞానకేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కిసానమోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, టీటీడీ ఢిల్లీ చైర్మన సుమంతరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, సందిరెడ్డి శ్రీనివాసులు, కనంపల్లి చిరంజీవిరెడ్డి మాట్లాడారు. ప్రధానిగా నరేంద్రమోదీ దేశంలోనే అత్యధిక రోజులు పనిచేసి చరిత్ర సృష్టించారన్నారు. తన సంస్కరణలు, సంక్షేమం, అభివృద్ధితో ప్రపంచదేశాలకు విశ్వగురువుగా భారతను తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. 60కోట్ల మంది పేదలకు కేంద్రప్రభుత్వ పథకాలతో అండగా నిలిచారన్నారు. ప్రకృతి వ్యవసాయం రైతుల పంటల సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు భూమి సారాన్ని పెంచి, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి దోహదపడుతుందని తెలిపారు. సతీ్‌షచంద్ర, సుబ్బారావు, శరతకుమార్‌ రెడ్డి, తిమ్మారెడ్డి, దామోదర్‌, ఆంజనేయులు, హనుమంతు, చంద్రమోహన రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:53 PM