Share News

ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలి

ABN , Publish Date - May 25 , 2026 | 11:55 PM

క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎంపీహెచఏ(మేల్‌)లను రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయాలని ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఫీల్డ్‌స్టాఫ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులను కోరింది.

ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలి
Field staff leaders submitting a petition to the DMHO

అనంతపురం వైద్యం, మే 25(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎంపీహెచఏ(మేల్‌)లను రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయాలని ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఫీల్డ్‌స్టాఫ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులను కోరింది. రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన మాట్లాడుతూ ఫీల్డ్‌స్టాఫ్‌కు రోజువారి ముఖ ఆధారిత అటెండెన్సను తొలగించాలన్నారు. ఆనలైన రిపోర్టులను సాయంత్రం 4గంటల తర్వాత సేకరించాలన్నారు. క్రమం తప్పకుండా ఎఫ్‌టీఏ చెల్లించాలన్నారు. రెగ్యులర్‌ అయిన ఎంపీహెచఏలకు ప్రొబేషన డిక్లేర్‌ చేయాలన్నారు. పోలీస్‌ వెరిఫికేషన పేరుతో కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన 70మందిని రెగ్యులర్‌ చేయాలని కోరారు. బలరామిరెడ్డి, వేమారెడ్డి, ధనుంజయ పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 11:55 PM