Share News

COLLECTOR: డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలి

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:49 PM

వ్యవసాయం రంగంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ శింగనమల మండలంలోని కేంద్ర వ్యసాయ యంత్రముల శిక్షణ మరియు పరీరక్ష సంస్థ(ట్రాక్టర్‌ నగర్‌)ను కలెక్టర్‌ ఆనంద్‌ పరిశీలించారు.

COLLECTOR: డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలి
Collector talking with the staff of Tractor Nagar

శింగనమల, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): వ్యవసాయం రంగంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ శింగనమల మండలంలోని కేంద్ర వ్యసాయ యంత్రముల శిక్షణ మరియు పరీరక్ష సంస్థ(ట్రాక్టర్‌ నగర్‌)ను కలెక్టర్‌ ఆనంద్‌ పరిశీలించారు. ఈసదర్బంగా కలెక్టర్‌ ట్రాక్టర్‌ నగర్‌లో యంత్రాలు ఎలా ఉన్నాయి, నాణ్యత ఎలా ఉందని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలోనే జిల్లాకు చెందిన ట్రాక్టర్‌ నగర్‌ సంస్థ ఒకటి అని, ఇక్కడ వ్యవసాయానికి అవసరమైన యంత్రాలను తయారు చేస్తారన్నారు. సంస్థ డైరెక్టర్‌ పీవీ రావు, తహసీల్దార్‌ శేషారెడ్డి పాల్గొన్నారు.

అలసత్వం వీడండి

గార్లదిన్నె: విధి నిర్వహణలో అలసత్వం వీడాలని అధికారులకు కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని మర్తాడు సచివాలయాన్ని ఆయన అకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలో రిజిస్టర్‌ను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు విధులకు వస్తున్నారా..? లేదా...? అని ప్రశ్నించారు. విధులకు హాజరైతే రిజిస్టర్‌లో ఎంటర్‌ చేయలేదని తోటి సిబ్బందిని ప్రశ్నించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెనకచెర్ల గ్రామంలో విద్యుత సబ్‌స్టేషన మంజురై ఆరు నెలలు అయింది. అవసరమైన స్థలాన్ని చూపాలని మాజీ ఎంపీపీ ముంటిమడుగు శ్రీనివా్‌సరెడ్డి, తాతిరెడ్డి, ఆవులక్రిష్ణ, గేటుక్రిష్ణారెడ్డి, రామాంజి తదితరులు రైతులతో కలసి కలెక్టర్‌కు విన్నవించారు. మర్తాడు గ్రామంలో భూగర్భ జాలాలు పూర్తిగా అడుగంటిపోయి పండ్లతోటలు ఎండిపోతున్నాయని మెర పెట్టుకున్నారు. ట్యాంకర్ల ద్వారా చెట్లకు నీటిని పెడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కాలువకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. డ్యాంలో నీరు లేవని నీరు విడుదల చేసే అవకాశం లేదని కలెక్టర్‌ తేల్చిచెప్పారు. సబ్‌స్టేషనకు అవసరమైన స్థలాన్ని కేటాయించేలా తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Apr 10 , 2026 | 11:49 PM