విద్యతోనే ఉన్నతస్థాయి
ABN , Publish Date - May 24 , 2026 | 11:57 PM
విద్యతోనే సమాజంలో గౌరవం, ఉన్నత స్థాయి దక్కుతాయని రాయలసీమ బలిజ మహా సంఘం జిల్లా అధ్యక్షుడు తొండపూనాటి శంకరయ్య తెలిపారు. ఆదివారం శ్రీనివాసనగర్‌లోని బాలాజీ కల్యాణమండపంలో సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు.
అనంతపురంరూరల్, మే 24(ఆంధ్రజ్యోతి): విద్యతోనే సమాజంలో గౌరవం, ఉన్నత స్థాయి దక్కుతాయని రాయలసీమ బలిజ మహా సంఘం జిల్లా అధ్యక్షుడు తొండపూనాటి శంకరయ్య తెలిపారు. ఆదివారం శ్రీనివాసనగర్‌లోని బాలాజీ కల్యాణమండపంలో సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ఆయనతో పాటు గౌరవాధ్యక్షులు పామురాయి వెంకటేశులు, బళ్లారి వెంకటరాముడు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రమేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో 136 మంది విద్యార్థులు 550 మార్కులు సాధించారని అన్నారు. ఈ స్థాయిలో బలిజ విద్యార్థులు మార్కులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు అందజేశారు. కార్యక్రమలో శింగనమల మార్కెట్ యార్డు చైర్మన దండు శ్రీనివాసులు, నాయకులు కోనేటి సాయిప్రసాద్, కృష్ణమూర్తి, సత్యనారాయణ, నాగేంద్ర ప్రసాద్, రవికుమార్, లెనిన, రామకృష్ణ, చలపతి, జీవీ రమణ, శివయ్య, రంగనాయకులు, నగేష్, పవనకుమార్, సూర్యనారాయణ, పద్మజ, మురళీకృష్ణ, వాసంతి సాహిత్య, గిరిధర్ ప్రసాద్ పాల్గొన్నారు.