పరిశోధనలకు ప్రోత్సాహం ఆనందకరం
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:03 AM
ఇనఫినిటీ పాఠశాలలో విద్యార్థులను చదువుతోపాటు పరిశోధనలవైపు ప్రోత్సహించడం ఆనందదాయకమని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ టీకే సుందరమూర్తి అన్నారు. శనివారం నగరంలోని ఇనఫినిటీ స్కూల్‌ను ఆయన సందర్శించి ఇస్రో అనుబంధ అంతరిక్షర పయోగశాలను ప్రారంభించారు.
అనంతపురం విద్య, జూన 13(ఆంధ్రజ్యోతి): ఇనఫినిటీ పాఠశాలలో విద్యార్థులను చదువుతోపాటు పరిశోధనలవైపు ప్రోత్సహించడం ఆనందదాయకమని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ టీకే సుందరమూర్తి అన్నారు. శనివారం నగరంలోని ఇనఫినిటీ స్కూల్‌ను ఆయన సందర్శించి ఇస్రో అనుబంధ అంతరిక్షర పయోగశాలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఒక్కటే కాదు ఇతరవాటిపైన అవగాహన, ఆసక్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా స్టెమ్ రంగంలో కెరియర్‌ని కొనసాగిస్తూ అంతరిక్ష పరిశోధనలలో ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. పరిశోధనలకు సంబంధించి ఇంత మంచి ల్యాబ్ ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ మల్లిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.