ఉపాధి కూలీలకు తాగునీరు అందించాలి
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:04 AM
వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నసనకోట పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు.
రామగిరి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నసనకోట పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు. ఎంతమంది కూలీలు హాజరయ్యారో పరిశీలించి ఆమె స్వయంగా హాజరును నమోదు చేశారు. ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పనులు చేసేందుకు ఇబ్బందిగా ఉందని కూలీలు ఆమె దృష్టికి తెచ్చారు. వేపవి కాలంలో కూలీలకు ఏర్పాటుచేయాల్సిన సౌకర్యాల గురించి ఆరాతీశారు. షామియానాలు, తాగునీరు కచ్చితంగా ఉండాలని ఉదయం త్వరగా పనులు ప్రారంభించి ముగించాలన్నారు. వేసవి ముగిసే వరకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం వెంకటాపురం సమీపంలోని సొంత వ్యవసాయ క్షేత్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. వేసవిలో నీరు పంటలకు ఎలా అందిస్తున్నారు, పంటలు ఎలా ఉన్నాయని పరిశీలించారు.
వాల్మీకి విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం: ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం సర్కిల్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన వాల్మీకి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని రాప్తాడు ఎమ్మెల్యేపరిటాలసునీతకు ధర్మవరం వాల్మీకి సోదరులు ఆహ్వానించారు.సోమవారం ఉదయం వెంకటాపురం గ్రామానికి ధర్మవరం వాల్మీకి సంఘం నాయకులు బొట్టుకిష్ట, చీమల రామాంజి, చీమల నాగరాజు, టైలర్‌గోపాల్,అంకన్న, అంకే శ్రీరాములు,చండ్రాయుడు, తుంపర్తి ఆంజనేయులు, నరసింహులు, కనుమ నరసింహులుతో పాటు 25వ వార్డు టీడీపీ ఇనచార్జ్ భీమనేని ప్రసాద్‌నాయుడు తదితరులు ఎమ్మెల్యేపరిటాలసునీతకు ఆహ్వానపత్రికను అందజేసి ప్రతిష్టకు రావాలని వారు కోరారు.అదేవిధంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కాల్వశ్రీనివాసులు, ధర్మవరంనియోజకవర్గ టీడీపీఇనచార్జ్ పరిటాలశ్రీరామ్‌లకు కూడా వాల్మీకి విగ్రహప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని వారు ఆహ్వానించారు.