MLA SUNITHA : సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:15 AM
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండలంలోని పేరూరులో శనివారం ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఇబ్బందులు గురించి విన్నారు.
రామగిరి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండలంలోని పేరూరులో శనివారం ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఇబ్బందులు గురించి విన్నారు. గతంలో వీటి గురించి అర్జీలు ఇచ్చారా, ఇచ్చిన వాటిపై అధికారులు ఎందుకు స్పందించలేదని ఆరా తీశారు. కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించాలన్నారు. పంచాయతీ రాజ్‌లో 22 అర్జీలు, రెవెన్యూశాఖ 12, పశుసంవర్దకశాఖ 2, హౌసింగ్ 5, పింఛన్లకు సం బంధించి 10 అర్జీలు వచ్చాయి. పదేపదే వచ్చే అర్జీలపై దృష్టిసారించాలన్నారు. పంచాయతీ కేంద్రాల్లో పరిష్కరించే సమస్యలు తమకు అర్జీలు వ స్తున్నాయని భూ సమస్యల విషయంలో అర్జీలు స్వీకరించకుండా వాటి సా ఽధ్యసాధ్యాల గురించి వివరించాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకకార్యద ర్శి రంగయ్య, నాయకులు రామ్మూర్తినాయుడు, సుధాకర్, అంజనప్ప, శ్రీధర్‌నాయుడు, పరంధామయాదవ్, లక్ష్మీనారాయణరెడ్డి, మారుతీప్రసాద్, రా మాంజనేయులు, వెంకటేశులు, వడ్డిశీన, అంజి, సుబ్బు, శ్రీనివాసులు, చిత్తరంజన, వెంకటేశ, మాదన్న, శ్రీరాములు పాల్గొన్నారు.