పారిశుధ్యంలో అవినీతి కంపు
ABN , Publish Date - May 24 , 2026 | 11:51 PM
ఒక ట్రిప్పు చెత్త తరలించి మూడు నాలుగు ట్రి ప్పులు తోలినట్లు బిల్లులు చేసుకుని అధికా రులు యథేచ్ఛగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో కో ట్లాది రూపాయలు అవినీతి జరుగుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.
రూ.6కోట్ల వరకు చెత్త బిల్లులు
తరలించేది ఒక ట్రిప్పు.. బిల్లులు మూడింటికి..
ఆ నలుగురు అధికారులదే కీలకపాత్ర
అనంతపురం క్లాక్‌టవర్, మే 24 (ఆంధ్రజ్యోతి): ఒక ట్రిప్పు చెత్త తరలించి మూడు నాలుగు ట్రి ప్పులు తోలినట్లు బిల్లులు చేసుకుని అధికా రులు యథేచ్ఛగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో కో ట్లాది రూపాయలు అవినీతి జరుగుతున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. చెత్త తరలిం పునకు సొంతంగా 18 వాహనాలు, అద్దె రూపంలో కాంట్రాక్ట్ వాహనాలు 36 ఉన్నాయి. ఇవి చాలవన్నట్లుగా ప్రైవేటు వాహనాల పేరుతో నకిలీ బిల్లులు చేసుకుంటూ అధికారులు త మ జేబుల్లోకి వేసుకుంటున్నారు. ప్రతి బిల్లు కూ కమీషన దండుకుంటూ ప్రజాఽధనాన్ని నీళ్లలాగా తాగేస్తున్నారు. కోట్లాది రూపాయా లు వెచ్చిస్తున్న క్రమంలో అసలు నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదు. అయితే ఎటుచూసిన చెత్త, మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. నిధులు మాత్రం కోట్లాది రూపాయలు బిల్లుల రూపంలో మెక్కేస్తున్నారు. ఒక ట్రిప్పు చెత్తను తరలిస్తూ మూడు నాలుగు ట్రిప్పులు తోలినట్లు బిల్లులు చేసుకుంటు న్నారు. ఇటీవల ఏసీబీకి చిక్కిన ఇనచార్జి ఎంహెచవో, ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఓ ఎగ్జామినర్, ఓ అకౌంట్స్ ఆఫీసర్ల పాత్ర కీలకంగా ఉన్నట్లు నగరపాలకసంస్థలో జోరుగా చర్చసాగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లకే రూ.6కోట్ల వరకు ప్రైవేటు అద్దె చెత్త తరలింపునకు బిల్లులు చెల్లించడం పట్ల సర్వత్రా విమర్శలు విన వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రజాప్రతినిధులకు బినామీలుగా వ్యవహరించిన ఇద్దరు ప్రైవేటు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం వెనుక ఆ నలుగురు అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. చెల్లించిన బిల్లుల్లో పర్సంటేజీల రూపం లో నలుగురు అధికారులకు వాటాలుగా పంచినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇందులో ఉన్నతాధికారులకు కూడా వాటాలు చెల్లించారా లేక ఆ నలుగురే పంచుకున్నారా అనేదానిపై సందేహాలున్నాయి.
ఆ ఇద్దరిపై ఎందుకంత మోజు?
నగరపాలక సంస్థలో ఆరు శానిటేషన సర్కిళ్లు ఉన్నాయి. నగరపాలక సంస్థకు చెందిన 18వాహనాలతో పాటు కాంట్రాక్టర్ల ద్వారా 36అద్దె వాహనాలు చెత్త తరలింపుకోసం వినియోగిస్తున్నారు. నగరపాలక సంస్థలో రెగ్యులర్‌గా సుమారు 40మంది కాంట్రాక్టర్లు పనులు చేస్తుంటారు. వీరిలో నేరుగా గత వైసీపీ రంగు వేసుకున్న వారు 10మందికి పైగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ రంగు వేసుకున్న ఇద్దరు కాంట్రాక్టర్లకే చెత్త తరలింపునకు రోజువారి బిల్లుల కోసం సుమారు రూ.6కోట్లకుపైగా బిల్లులు చెల్లించారు. అంటే ఆ వైసీపీ కాంట్రాక్టర్లపై నగరపాలకసంస్థ అఽధికారులకు ఎం దుకంత మోజు అనేది ఇక్కడ చర్చనీయ అంశం గా మారింది. అంతేగాక చెత్త తరలింపు వాహనాలు ఏపీ02 డిసి 1305, ఏపీ39 యూటీ 1352, ఏపీ39 యూఎస్ 1412 నంబర్ల వాహనాలపైనే ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు సమాచారం. ప్రైవేటు చెత్త వాహనాల పేరుతో కోట్లాది రూపాయల నిధులు సంస్థలోని కొందరు అధికారులు తమ జేబుల్లోకి వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత తతంగం జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రైవేటు ట్రాక్టర్ల ద్వారా చెత్త తరలింపుతో తప్పుడు బిల్లులు చెల్లిస్తూ ముడుపుల రూపంలో గుంజుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సర్వత్రా విమర్శలు
నగరపాలక సంస్థలో చెత్తతరలింపు పేరుతో చెల్లించిన బిల్లులపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. సాధారణంగా శానిటేషన విభాగంలోని అధికారులే చెత్త తరలింపు వాహనాలకు బిల్లులు చెల్లించే అఽధికారం ఉంటుంది. ఇటీవల ఏసీబీ దాడుల్లో చిక్కిన నలుగురు అధికారులు చెత్త తరలింపు వాహనాలకు బిల్లులు చెల్లింపులో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. ఆరు నెలల కాలంలో చెత్త తరలింపునకు అద్దె వాహనాలు ఉన్నప్పటికీ....తాత్కాలిక అద్దె రోజువారి బిల్లులు రూ.6కోట్ల వరకు చెల్లించారంటే ఏ స్థాయిలో అవినీతికి ఆజ్యంపోశారో అర్థమవుతుంది. ఇటీవల ఓ అకౌంట్స్ ఆఫీసర్‌కి చెత్త తరలింపు బిల్లుల కోసం రోజువారి అద్దె కోసం డిజిటర్ పేమెంట్ ఫోనపే ద్వారా ముడుపులు పుచ్చుకున్నట్లు నగరపాలక సంస్థలో సంచలనంగా మారింది. ఓ శానిటేషన ఇనస్పెక్టర్ సొంతంగా ప్రైవేటు వాహనం నడుపుతూ విచ్చలవిడిగా బిల్లులు చేసుకుంటున్నా అడిగే నాథుడే కరువయ్యాడు.
ప్రతి బిల్లుకు లెక్కలు తప్పనిసరి
నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి బిల్లుకి లెక్కలు తప్పనిసరిగా ఉండాలి. చెత్త తరలింపునకు సొంత, అద్దె వాహనాలు ఉన్నాయి. వీటితో అప్పుడప్పుడు అవసరానికి అనుగుణంగా ప్రైవేటు వాహనాలను వినియోగిస్తుంటారు. ప్రైవేటు వాహనాల ద్వారా చెత్త తరలింపునకు బిల్లులను రెండుమూడుసార్లు పరిశీలించి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎవరికైనా సందేహాలుంటే తన దృష్టికి తీసుకువస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఒక ట్రిప్పు చెత్త తరలించి రెండు మూడు ట్రిప్పులు తోలినట్లు బిల్లులు పెడితే సహించేది లేదు.
-జస్వంతరావు, కమిషనర్