Share News

ఆధునిక సౌకర్యాలతో బస్‌ స్టేషన నిర్మాణం

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:32 AM

ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతంగా బస్‌ స్టేషన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. పట్టణంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.5కోట్ల అంచనా వ్యవయంతో నూతన బస్‌ స్టేషన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఆధునిక సౌకర్యాలతో బస్‌ స్టేషన నిర్మాణం
Minister Bharath unveiling the plaque

గుత్తి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం అధునాతంగా బస్‌ స్టేషన నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. పట్టణంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్‌లో రూ.5కోట్ల అంచనా వ్యవయంతో నూతన బస్‌ స్టేషన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆర్టీసీ రిజనల్‌ చైర్మన పూలనాగరాజు, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్‌ సమక్షంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం మహిళలకు స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తూ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. మహిళలకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఎమ్మెల్యే తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌, రిజనల్‌ మేనేజర్‌ శ్రీలక్ష్మీ, డీఎంలు అప్పన్న, విశ్వనాథ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌మీయా, మార్కెట్‌ యార్డు చైర్మన సూర్యప్రతాప్‌ పాల్గొన్నారు.

కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు: పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని మంత్రి టీజీ భరత, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం రాత్రి నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ టీడీపీకి కార్యకర్తలే బలమైన పునాది అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి, తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌, కార్మిక శాఖ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్‌, మార్కెట్‌ యార్డు చైర్మన సూర్యప్రతాప్‌, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన ప్రభాకర్‌ చౌదరి, డాక్టర్స్‌ సెల్‌ హిమబిందు, న్యాయవాది సోమశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 12:32 AM