Share News

కిక్కిరిసిన కలెక్టరేట్‌.. 751 అర్జీల స్వీకరణ

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:45 PM

స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌లతో కలెక్టర్‌ కార్యాలయం ఆవరణం కిక్కిరిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు 751 వినతులు అందజేశారు.

కిక్కిరిసిన కలెక్టరేట్‌.. 751 అర్జీల స్వీకరణ
Collector Anand is receiving petitions from the people

మాజీ మంత్రి శైలజానాథ్‌, మాజీ ఎంపీ రంగయ్య వినతి

అనంతపురం కలెక్టరేట్‌, జూన 22(ఆంధ్రజ్యోతి): స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌లతో కలెక్టర్‌ కార్యాలయం ఆవరణం కిక్కిరిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు 751 వినతులు అందజేశారు. కలెక్టర్‌ ఆనంద్‌తో పాటు జేసీ విష్ణుచరణ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాశకుమార్‌, డీఆర్‌వో మలోల, ఎఫ్‌ఎ్‌సవో రామకృష్ణారెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన, మల్లికార్జునరెడ్డి, కిరణ్మయి వినతులు స్వీకరించారు. అర్జీలు ఇచ్చే సమయంలో చాలా మంది కలెక్టర్‌ ఎదురుగా ఉన్న క్యూలైనలోనే ఉండటం గమనార్హం. కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లలో వస్తున్న అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. ఐవీఆర్‌ఎస్‌ ఫీడ్‌ బ్యాక్‌కు సంబంధించి ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో పాజిటివిటీ శాతంలో మరింత పురోగతి వచ్చేలా చూడాలన్నారు. ఆ శాఖ ఎస్‌ఈ క్షేత్రస్థాయిలో రెండు, మూడు ప్రాంతాల్లో పర్యటించి విద్యత సరఫరాపై తనిఖీలు చేయాలన్నారు. పెన్నా పరిధిలో ఇసుక రీచలను అందుబాటులోకి తీసుకురావాలని డీడీ మైన్సను ఆదేశించారు. పోలీస్‌ శాఖ పరిధిలో అందించే సేవల్లో కూడా మరింత పురోగతికి తీసుకురావాలన్నారు.

రైతు కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలి

జిల్లాలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని మాజీ మంత్రి, వైసీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్‌, మాజీ ఎంపీ రంగయ్య కోరారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సలో కలెక్టర్‌ను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలు పెరిగిపోయి, ఆర్థికంగా కుప్పకూలిపోతున్నారన్నారు. మరోవైపు ప్రభుత్వం సమస్యలను గాలికొదిలేసి ప్రచారాలకే పరిమితమవుతోందన్నారు. పుట్లూరు, నార్పల మండలాల్లో రైతులు చంద్రమోహన, నాగలింగమయ్య, ఆదినారాయణ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వం స్పదించాలన్నారు.

విద్యాకానుక ఎప్పుడిస్తారు..?

రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైనా విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందించలేరా..?అని వైసీపీ యువజన, విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట వైసీపీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జేసీ విష్ణుచరనకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి, దాదాఖలందర్‌, లోక్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 11:45 PM