MLA SUNITHA: అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:41 PM
చేస్తున్న అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. శుక్రవారం ఆమె అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
అనంతపురం క్రైం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): చేస్తున్న అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. శుక్రవారం ఆమె అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గ, మండలస్థాయిలో పెండింగ్ ఉన్న పార్టీ కమిటీలు, అనుబంధ పార్టీ కమిటీలు గురించి ఆరా తీశారు. ఎక్కడెక్కడ కమిటీలు పెండింగ్ ఉన్నాయని, పదవుల గురించి ఆమె అడిగి తెలుసుకకున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, నిత్యం యాక్టివ్‌గా ఉండేవారికి పదవులు ఉంటాయన్నారు. నియోజకవర్గంలో రికార్డుస్థాయిలో అభివృద్ధి పనులు జరిగాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. నాయకులు రామకృష్ణప్ప, కాటమయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ప్రజల నుంచి అర్జీల స్వీకరణ: తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవన్యూ, పంచాయతీరాజ్, విద్యుత శాఖలకు సంబంధించి అధిక అర్జీలు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆమె సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 90 శాతం వరకూ పరిష్కారం అవుతున్నాయని, మరింత చొరవ చూపి అర్జీదారులకు న్యాయం చేయాలన్నారు. త్వరలోనే అర్హులైన వారికి ఇళ్లు, పింఛన్లు అందిస్తామన్నారు.