Share News

TDP : అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:35 AM

సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. శనివారం రాత్రి మండల కేంద్రంలో టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి నిరసన చేపట్టారు.

TDP : అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం
రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న శ్రీరాములు, నాయకులు

బ్రహ్మసముద్రం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. శనివారం రాత్రి మండల కేంద్రంలో టీడీపీ మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి నిరసన చేపట్టారు. స్థానిక బస్టాండు వద్ద అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి నినాదాలు చేస్తూ ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కుందుర్పి(ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలో శనివారం మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు స్థానిక ప్రధాన రహదారిపై నిరసన చేపట్టి ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాంబాబుపై చర్యలు తీసుకోవాలని వెంటనే క్షమాపణ చేప్పాలని డిమాండ్‌ చేశారు. స్థానిక పోలీ్‌సస్టేషనలో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

అంబటికి మతిభ్రమించింది: కమ్మ కార్పొరేషన డైరెక్టర్‌

పుట్లూరు, జనవరి31(ఆంధ్రజ్యోతి): అధికారం కోల్పోయాక వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మతిభ్రమించిందని కమ్మ కార్పొరేషన డైరెక్టర్‌ సుదర్శననాయుడు, టీడీపీ మండల కన్వీనర్‌ శ్రీనివాసులు నాయుడు శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబును అసభ్యపదజాలంతో మాట్లాడడం బాధాకరమన్నారు. ఇలాంటి నాయకులను జగనరెడ్డి పార్టీలో పెట్టుకోవడం దుర్మార్గమన్నారు.

Updated Date - Feb 01 , 2026 | 12:35 AM