ఎనక్యా్‌ప పనులకు అనుమతివ్వండి
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:48 PM
నగరంలో కేంద్రప్రభుత్వం అందించే ఎనక్యా్‌ప నిధులకు సంబంధించిన అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టేందుకు వెంటనే అనుమతివ్వాలని ఎస్‌వి ఇనఫ్రా కాంట్రాక్టర్ శ్రీనివాసచౌదరి కోరారు.
అనంతపురం క్లాక్‌టవర్, జూన 22(ఆంధ్రజ్యోతి): నగరంలో కేంద్రప్రభుత్వం అందించే ఎనక్యా్‌ప నిధులకు సంబంధించిన అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టేందుకు వెంటనే అనుమతివ్వాలని ఎస్‌వి ఇనఫ్రా కాంట్రాక్టర్ శ్రీనివాసచౌదరి కోరారు. సోమవారం స్థానిక అనంత నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ జస్వంతరావు, ఎస్‌ఈ రాజశేఖర్, డిప్యూటీ కమిషనర్ అంజయ్య, టీపీఓ ఓంకార్‌లు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ విభాగానికి సంబంధించి 2 అర్జీలు, ఇంజనీరింగ్ 5, టౌనప్లానింగ్ 4, శానిటేషన 3 మొత్తం 14 వినతులు స్వీకరించారు. నగర సుందరీకరణకు సంబంధించి ఎనక్యా్‌ప నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు వెంటనే అగ్రిమెంట్ చేసి, టెండర్ ప్రక్రియలో అనవసర జోక్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌వీ ఇనఫ్రా కాంట్రాక్టర్ శ్రీనివాసచౌదరి కోరారు. టవర్‌క్లాక్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద స్థలంలో గ్రీనరీ, బ్యుటిఫికేషన కింద అభివృద్ధి పనులు చేసేందుకు గాను నిర్వహించిన టెండర్‌కు సంబంధించి మే 21వతేదీన బిడ్ ఓపెన చేసి నాన జుడీషియల్ స్టాంప్ పేపర్‌తో పాటు బ్యాంకు గ్యారెంటీని అందజేశామన్నారు. అయినప్పటికీ అగ్రిమెంట్ చేసుకోకుండా ఎటువంటి చట్టబద్దమైన కారణం లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా ఒప్పంద ప్రకియ్రను ఆలస్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హౌసింగ్‌బోర్డు, విద్యుతనగర్ మెయిన రోడ్డులో డివైడర్లపై మొక్కలు నాటాలని, రోడ్లకు లైన్లు వేసి, కాలనీలకు నేమ్‌బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు మోహనరావు, శ్రీనివాసులు రెడ్డి, ఉపేంద్రలు వినతిపత్రం అందజేశారు. 16నెలలుగా స్వీపర్‌గా పనిచేస్తున్న జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని కార్మికురాలు నాగలక్ష్మి విన్నవించారు. ఆదర్శనగర్‌లోని బెస్తసేవాసంఘం కమ్యూనిటీహాల్, గంగమ్మ, పోలేరమ్మ ఆలయాలకు ప్రహారీ నిర్మాణం చేపట్టాలని బెస్త కార్పోరేషన రాష్ట్ర డైరెక్టర్ పవనకుమార్, సంఘం జిల్లా అధ్యక్షుడు చేపల హరి, గౌరవాధ్యక్షుడు బాలన్న, ప్రధాన కార్యదర్శి భాస్కర్, నగర అధ్యక్షుడు నాగరాజు, కోశాధికారి గిరిధర్ వినతిపత్రం అందజేశారు.