ఎనక్యా్‌ప పనులకు అనుమతివ్వండి
ABN , Publish Date - May 25 , 2026 | 11:58 PM
కేంద్ర ప్రభుత్వం నగర సుందరీకరణ కోసం మంజూరు చేసిన ఎనక్యా్‌ప నిఽధులకు సంబంధించిన పనులు చేసేందుకు అనుమతివ్వాలని కాంట్రాక్టర్ శ్రీనివాసచౌదరి కోరారు. సోమవారం స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)లో ఎస్‌ఈ రాజశేఖర్‌తో కలిసి కమిషనర్ జస్వంతరావు అర్జీలు స్వీకరించారు.
అనంతపురం క్లాక్‌టవర్, మే 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నగర సుందరీకరణ కోసం మంజూరు చేసిన ఎనక్యా్‌ప నిఽధులకు సంబంధించిన పనులు చేసేందుకు అనుమతివ్వాలని కాంట్రాక్టర్ శ్రీనివాసచౌదరి కోరారు. సోమవారం స్థానిక నగరపాలకసంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎ్‌స)లో ఎస్‌ఈ రాజశేఖర్‌తో కలిసి కమిషనర్ జస్వంతరావు అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా కేంద్రప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన సుందరీకరణ చేయడం కోసం నేషనల్ క్లీన ఎయిర్ ప్రోగ్రాం కింద కోట్లాది రూపాయల నిధులు చెల్లిస్తోందని, నిర్ణీత గడువులోపు పనులు చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదముందని, వెంటనే పనులకు అనుమతివ్వాలని కాంట్రాక్టర్ కోరారు. మొత్తం 23 వినతులు అందజేయగా ఇందులో టౌనప్లానింగ్ 4, శానిటేషన 6, ఇంజనీరింగ్ 10, రెవెన్యూ, పరిపాలనా, హార్టికల్చర్ ఒక్కొక్కటి చొప్పున అర్జీలు అందజేశారు.
ఆపరేషన క్లీనస్వీ్‌పతో నగర రూపురేఖలు మార్చాలి
అనంతపురం క్లాక్‌టవర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన క్లీనస్వీ్‌పతో నగర రూపురేఖలు మార్చాలని కమిషనర్ జస్వంతరావు సూచించారు. సోమవారం స్థానిక బళ్ళారిరోడ్డు, కళ్యాణదుర్గం రోడ్డులలో జరుగుతున్న శానిటేషన పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలందరూ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లు, మురుగుకాలవల్లో వేయరాదని, చెత్తసేకరణ వాహనం వచ్చినప్పుడు వేయాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇనచార్జి ఎంహెచవో సునీత ఆధ్వర్యంలో ఒకటోరోడ్డు, రెండోరోడ్డు, నాలుగోరోడ్డు, ఐదోరోడ్డు, ఆరవ రోడ్డు, గుత్తిరోడ్డు, పాతూరు, తిలక్‌రోడ్డు, సంగమే్‌షనగర్, గాంధీబజార్, కలెక్టరేట్ మెయిన రోడ్డు, నవోదయకాలనీ ప్రాంతాలలో దుకాణాలపై తనిఖీలు చేశారు.